ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో పది ఆలయాల్లో భక్తులకు ఉచిత ప్రసాదం

ABN, First Publish Date - 2022-04-24T13:16:21+05:30

రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ నిర్వహిస్తున్న పది ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                        - వడపళనిలో శ్రీకారం చుట్టిన మంత్రి శేఖర్‌బాబు


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ నిర్వహిస్తున్న పది ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ బృహత్తర పథకాన్ని శనివారం స్థానిక వడపళనిలో ప్రసిద్ధిచెందిన సుబ్రమణ్యస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... వడపళని సుబ్రమణ్యస్వామి ఆలయం, తిరువేర్కాడు దేవికరుమారియమ్మన్‌, పళని దండాయుధపాణి, మదురై మీనాక్షి సుందరేశ్వరర్‌, తిరుచెందూర్‌ సుబ్రమణ్యస్వామి, సమయపురం మారియమ్మన్‌, తిరుత్తణి సుబ్రమణ్యస్వామి, శ్రీరంగం రంగనాథస్వామి, మరుదుమలై సుబ్రమణ్యస్వామి, బన్నారి మారియమ్మన్‌ అని 10 ఆలయాల్లో భక్తులకు రోజంతా ఉచిత ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. చక్కెర పొంగలి, పులిహోర, కొబ్బరన్నం, లడ్డూ తదితర ఆరు రకాల ప్రసాదాలను ఒకదాని తర్వాత ఒకటి పంపిణీ చేసేందుకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. ఉచిత ప్రసాదం పంపిణీ పథకాన్ని రాష్ట్రంలోని మరికొన్ని ఆలయాలకు విస్తరింపజేస్తామని, దేవాదాయ శాఖ తరఫున ప్రకటించిన 112 ప్రకటనల్లో 100 ప్రకటనలను విజయవంతంగా అమలుపరుస్తున్నామని మంత్రి తెలిపారు. మదురై చిత్తిరై ఉత్సవాల్లో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని, రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతను ముమ్మరం చేస్తామని చెప్పారు. కరోనా నిబంధనల సడలింపు అనంతరం ఆలయాలకు తరలివెళ్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, భక్తులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి చంద్రమోహన్‌, కమిషనర్‌ కుమరగురుపరన్‌, అడిషినల్‌ కమిషనర్లు కన్నన్‌, తిరుమగళ్‌, ఎమ్మెల్యేలు జె.కరుణానిధి, మయిలై వేలు, వడపళని ఆలయ జాయింట్‌ కమిషనర్లు ధనపాల్‌, రేణుకాదేవి, సుదర్శన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-04-24T13:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising