ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Loksabha కొత్త Chief Whip ను నియమించిన Uddhav

ABN, First Publish Date - 2022-07-07T00:52:52+05:30

మహారాష్ట్ర అసెంబ్లీలో మైనారిటీలో పడిపోయిన శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం లోక్‌సభకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో మైనారిటీలో పడిపోయిన శివసేన ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) వర్గం లోక్‌సభకు కొత్త చీఫ్ విప్‌ (Loksabha chief Whip)ను నియమించింది. ప్రస్తుతం లోక్‌సభలో చీఫ్ విప్‌గా ఉన్న భావ్నా గావ్లి స్థానంలో రంజన్ విచారేను లోక్‌సభ‌లో శివసేన చీఫ్ విప్‌గా నియమించింది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేస్తూ బుధవారం ఒక లేఖ రాశారు.


శివసేనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏక్‌నాథ్ షిండే ఎట్టకేలకు ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన ప్రభుత్వాన్ని గద్దెదింపి ముఖ్యమంత్రి కావడం, అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే వర్గం అప్రమత్తమైందని, ఎంపీల నుంచి తిరుగుబాటు రాకుండా కొత్త చీఫ్ విప్ నియామకం చేపట్టిందని పార్టీ వర్గాలు తెలిపాయి. బలపరీక్షలో నెగ్గిన తమదే నిజమైన శివసేన అని షిండే వర్గం క్లెయిమ్ చేస్తుండగా, చట్టపరమైన అంశాలన్నీ తమకే సానుకూలమని, తమదే అసలు సిసలైన శివసేన అని ఉద్ధవ్ థాకరే వర్గం వాదనగా ఉంది.

Updated Date - 2022-07-07T00:52:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising