ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Agnipathతో discipline వస్తుంది: Tata sons

ABN, First Publish Date - 2022-06-21T18:06:07+05:30

అగ్నిపథ్ అనేది కేవలం దేశ రక్షణ రంగానికి సేవలందించే గొప్ప అవకాశం మాత్రమే కాదు. దీని వల్ల క్రమశిక్షణ కలిగిన, నైపుణ్యం పొందిన యువత తయారవుతుంది. ఇది దేశ పరిశ్రమకు, టాటా లాంటి సంస్థలకు ఉపయోగపడుతుంది. అగ్నివీర్ల సామర్థ్యాన్ని టాటా గ్రూప్ గుర్తించింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం(Agnipath scheme)ను మరొక పారిశ్రామికవేత్త సమర్ధించారు. ఈ పథకం ద్వారా క్రమశిక్షణ కలిగిన, నైపుణ్యం కలిగిన యువత(disciplined and trained youth) తయారవుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్‌.చంద్రశేఖరన్(Tata Sons Chairman N Chandrasekaran) అన్నారు. దేశ పరిశ్రమకు ఈ యువత ఎంతగానో తోడ్పాడుతుందని, టాటా గ్రూప్‌కు కూడా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ పథకానికి ఇప్పటికే మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్ర, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంక, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందర్ షా, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి వంటి పారిశ్రామిక వేత్తలు సమర్ధించారు.


‘‘అగ్నిపథ్ అనేది కేవలం దేశ రక్షణ రంగానికి సేవలందించే గొప్ప అవకాశం మాత్రమే కాదు. దీని వల్ల క్రమశిక్షణ కలిగిన, నైపుణ్యం పొందిన యువత తయారవుతుంది. ఇది దేశ పరిశ్రమకు, టాటా లాంటి సంస్థలకు ఉపయోగపడుతుంది. అగ్నివీర్ల సామర్థ్యాన్ని టాటా గ్రూప్ గుర్తించింది. ఇలాంటి అవకాశాల్ని మేము స్వాగతిస్తున్నాం’’ అని చంద్రశేఖరన్ అన్నారు. దీనికి ముందు ఈ పథకంపై ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్ ఉద్యోగ అవకాశం కల్పిస్తుందని ప్రకటించారు. అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువతను రిక్రూట్ చేసుకోవడానికి మహీంద్రా గ్రూప్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-06-21T18:06:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising