ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Thanguthuri Ramakrishna: ‘వామ్‌’ను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-08-05T13:48:30+05:30

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్‌)ను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని గ్లోబల్‌ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ(Thanguthuri Ramakrishna) పేర్కొ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                    - తంగుటూరి రామకృష్ణ


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 4: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్‌)ను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని గ్లోబల్‌ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ(Thanguthuri Ramakrishna) పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గత నెల 17న జరిగిన వామ్‌ గ్లోబల్‌ సదస్సుపై ప్రత్యేక సమావేశం బుధవారం సాయంత్రం నగరంలో జరిగింది. వామ్‌ గ్లోబల్‌ సలహాదారుడు, జైరాజ్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తాడేపల్లి రాజశేఖర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ సభను విజయవంతం చేసిన తంగుటూరి రామకృష్ణను రాజశేఖర్‌, జయశ్రీ దంపతులు వెండి కిరీటంతో సత్కరించారు. సంస్థ విదేశీ విభాగం చైర్మన్‌ ఎంఎన్‌ఆర్‌ గుప్తా, బెల్లంకొండ సాంబశివరావు, అజంతా అధినేత డా.కనిగెలుపుల శంకర్‌రావు, ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షుడు జేఎం.నాయుడు, సురేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ అధినేత కేఎం సురేష్ బాబు, కస్టమ్స్‌ మాజీ అధికారి లయన్‌ విజయేంద్రరావు, టామ్స్‌ వ్యవస్థాపకుడు గొల్లపల్లి ఇశ్రాయేల్‌, హైదరాబాద్‌(Hyderabad) పారిశ్రామికవేత్తలు కోటగిరి మధుబాబు, నగేష్‌, ఐవీఎఫ్‌ కార్యదర్శి పువ్వాడ శేషాద్రి(Puvvada Seshadri), వాసవి క్లబ్‌ మాజీ గవర్నర్‌ సీహెచ్‌ వెంకటేశ్వరరావు, శ్రీలత, సోయావిట్‌ శరత్‌చంద్ర, బిల్డర్‌ మోతీష్‌ తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షుడు తాడేపల్లి రాజశేఖర్‌ మాట్లాడుతూ... 75 వసంతాల స్వాతంత్య్ర భారతదేశంలో తంగుటూరి రామకృష్ణ నేతృత్వంలోని వామ్‌ పలురంగాల్లో రాణిస్తున్న వైశ్య ప్రముఖులను ప్రోత్సహించేలా జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశం ప్రపంచ దేశాల్లోని ఆర్యవైశ్యులకు ఎంతో ఉపయోగకరమైనదన్నారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి సంప్రదించుకోలేని బంధువులను కలిపిన వేదికగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అజంతా శంకరరావు మాట్లాడుతూ, వైశ్యుల్లో అనురాగాలు, ఐక్యత పెంపొందింపజేసేలా గ్లోబల్‌ సమావేశాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తంగుటూరి రామకృష్ణ((Thanguthuri Ramakrishna) మాట్లాడుతూ... లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, వామ్‌ గౌరవాధ్యక్షుడు, ఎంపీ టీజీ వెంకటేశ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నతస్థాయిలో ఉన్న వైశ్యుల సమష్టి సహకారంతో హైదరాబాద్‌ సభ విజయవంతం చేశామన్నారు. 30 దేశాలకు చెందిన ప్రతినిధులు, దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో పాటు సుమారు 12 వేల మంది పాల్గొన్నారని, 2023లో దుబాయ్‌, 2024లో సింగపూర్‌లో మళ్లీ గ్లోబల్‌ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. విద్య, వైద్యం, ఆధ్యాత్మిక, వ్యాపార రంగాలపై అవగాహన కల్పించడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కుల, మత, భాషలకు అతీతంగా వామ్‌ను 200 దేశాల్లో విస్తరింపజేయడమే తమ లక్ష్యమని రామకృష్ణ ప్రకటించారు.

Updated Date - 2022-08-05T13:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising