ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటినుంచి చిన్నారులకు టీకా

ABN, First Publish Date - 2022-03-16T13:44:01+05:30

రాష్ట్రంలో 12 నుంచి 14 ఏళ్లలోపున్న చిన్నారులకు టీకాలు వేసే కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుంది. ఈ టీకాలు వేసుకునేందుకు 31 లక్షల మంది చిన్నారులున్నట్లు ఆరోగ్యశాఖ అంచనా వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్రంలో 31 లక్షల మంది చిన్నారులు

- పాఠశాలల్లోనే ప్రత్యేక శిబిరాలు


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో 12 నుంచి 14 ఏళ్లలోపున్న చిన్నారులకు టీకాలు వేసే కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుంది. ఈ టీకాలు వేసుకునేందుకు 31 లక్షల మంది చిన్నారులున్నట్లు ఆరోగ్యశాఖ అంచనా వేసింది. దేశం లో కరోనా వ్యాక్సినేషన్‌ జనవరి 16వ తేది ప్రారం భమైంది. 15 నుంచి 18 ఏళ్లలోపున్న చిన్నారుల కు వ్యాక్సినేషన్‌ జనవరిలో ప్రారంభమైంది. అదే సమయంలో రెండు డోస్‌లు వేసుకున్న ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌ వేసే పనులు కూడా జరుగుతున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్లలోపున్న చిన్నారులకు బుధవారం నుంచి వ్యాక్సిన్‌ వేయనున్నారు..  12 ఏళ్లు పూర్తయిన వారికి  కొత్తగా వచ్చిన ‘కోర్బెవాక్స్‌’ వినియోగించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.  ఈ విషయమై ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డా.సెల్వవి నాయగం మాట్లాడుతూ.. 12-14 ఏళ్లలోపున్న వారికి టీకా వేసే పనులు బుధవారం ప్రారంభి స్తున్నామన్నారు. ప్రస్తుతం 21 లక్షల కోర్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ నిల్వలున్నాయని, తమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, కార్పొరేషన్‌, ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2022-03-16T13:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising