ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former Minister: స్టాలిన్‌ సూచనల మేరకే అన్నాడీఎంకే కార్యాలయంపై దాడి

ABN, First Publish Date - 2022-09-04T16:13:32+05:30

సీఎం స్టాలిన్‌(CM Stalin) సూచనల మేరకే అన్నాడీఎంకే కార్యాలయంపై దాడి చేసి జయలలిత(Jayalalithaa) గదిని పూర్తిగా దోచుకున్నారని మాజీ మం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                  - మాజీ మంత్రి సీవీ షణ్ముగం ధ్వజం


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 3: సీఎం స్టాలిన్‌(CM Stalin) సూచనల మేరకే అన్నాడీఎంకే కార్యాలయంపై దాడి చేసి జయలలిత(Jayalalithaa) గదిని పూర్తిగా దోచుకున్నారని మాజీ మంత్రి సీవీ షణ్ముగం ఆరోపించారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దాడిపై తాను చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. దాడి జరిగి 50 రోజులు గడిచినా పన్నీర్‌సెల్వం(Panneerselvam) ఆయన అనుచరులపై ఎలాంటి చర్యలు లేవన్నారు. సీఎం స్టాలిన్‌ సూచనల ప్రకారం కార్యాలయంపై దాడి జరిగిందన్నారు. ఘటనకు డీఎంకే కారణమని, అందుకు పోలీసు శాఖ కూడా వారికి సహకరిస్తోందని ఆరోపించారు. సీబీసీఐడీ పోలీసులు(CBCID Police) ఇప్పటివరకు కూడా కార్యాలయానికి వెళ్లి ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. రెండు రోజులు వేచి చూస్తామని, అప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. 15 నెలల పాలనలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మాదకద్రవ్యాల చెలామణి అధికమైందని, రాష్ట్ర పోలీసు శాఖ డీఎంకే కార్యకర్తల దళంగా మారందని ఆయన ఆరోపించారు.

Updated Date - 2022-09-04T16:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising