ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ టీకా తప్పనిసరి కాదు...TamilNadu సర్కారు ఉత్తర్వులు

ABN, First Publish Date - 2022-04-04T13:52:39+05:30

కొవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ టీకాలపై సంచలన నిర్ణయం తీసుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కొవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ టీకాలపై సంచలన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో సందర్శించే వ్యక్తులకు కొవిడ్ టీకా తప్పనిసరి అని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను తమిళనాడు సర్కారు ఉపసంహరించుకుంది. తప్పనిసరి కొవిడ్ టీకా నోటిఫికేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఇతర కొవిడ్-19 ప్రోటోకాల్‌లు అమలులో ఉంటాయని పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగం తెలిపింది.‘‘తమిళనాడు రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు తగ్గిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ద్వారా కొవిడ్-19ని నిరోధించడానికి విధించిన అన్ని పరిమితులను ఎత్తివేయాలని నిర్ణయించాం. తమిళనాడు 92 శాతానికి పైగా వ్యాక్సినేషన్ కవరేజీని సాధించింది. 


అయితే 18 ఏళ్లు పైబడిన వారికి వరుసగా మొదటి రెండవ డోసు వేసేందుకు తమిళనాడు పబ్లిక్ హెల్త్ యాక్ట్ 1939 కింద జారీ చేసిన నోటిఫికేషన్‌ను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించాం’’ అని సర్కారు పేర్కొంది.అయితే సామాజిక దూరాన్ని పాటించడం, ముఖానికి మాస్క్‌లు ధరించడం వంటి కొవిడ్ నిబంధనలను అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించాలని ఆరోగ్య శాఖ అధికారులను సర్కారు ఆదేశించింది.


Updated Date - 2022-04-04T13:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising