ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాణాసంచా యూనిట్‌లో ఘోర ప్రమాదం..

ABN, First Publish Date - 2022-01-06T00:18:06+05:30

బాణాసంచా యూనిట్‌లో ఘోర ప్రమాదం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్తూరు: తమిళనాడు రాష్ట్రంలో ఓ బాణాసంచా తయారీ యూనిట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా యూనిట్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. తమిళనాడు విరుదునగర్ జిల్లా సత్తూరు పట్టణ సమీపంలోని ఉన్న మంజలోదైపట్టి గ్రామంలో సోలై బాణసంచా యూనిట్‌లో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. బాణసంచా యూనిట్‌ యజమాని కరుప్పసామి (40), కార్మికులు కాశి (40), సెంథిల్‌కుమార్‌ (35) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులు మునియసామి (45), సరస్వతి (40), అయ్యామల్ (48)గా గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురిని రక్షించి కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మరియు ఇతర సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. బాణాసంచా యూనిట్ లైసెన్స్‌ పొందినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వనున్నారు. ఐదు రోజుల్లో విరుదునగర్ జిల్లాలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది రెండోసారి. శ్రీవిల్లిపుత్తూరు సమీపంలోని కలత్తూరులో జనవరి 1న బాణాసంచా యూనిట్‌లో ఇదే ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.

Updated Date - 2022-01-06T00:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising