ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

love marriage: ముగ్గురు తమిళ యువతులతో ఫ్రెంచ్‌ యువకుల ప్రేమ వివాహం

ABN, First Publish Date - 2022-08-16T15:59:02+05:30

ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ముగ్గురు యువకులు ఓ తమిళ కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ముగ్గురిని ప్రేమవివాహం(love marriage) చేసుకున్నారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ముగ్గురు యువకులు ఓ తమిళ కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ముగ్గురిని ప్రేమవివాహం(love marriage) చేసుకున్నారు. ఈ వివాహంతో తిరుచెందూరు ఆలయంలో సందడి నెలకొంది. తిరునల్వేలి జిల్లా సుద్దమల్లి ప్రాంతానికి చెందిన మాసిలామణి, ఆనంది దంపతులు. వీరు సంవత్సరాలుగా ఫ్రాన్స్‌దేశంలో నివసిస్తూ ఆ దేశపు పౌరసత్వాన్ని కలిగి ఉంటున్నారు. మాసిలామణి ఓ రెస్టారెంట్‌(Restaurant)లో మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. వీరికి గాయత్రి, కీర్తిక, నారాయణి అనే ముగ్గురు కుమార్తెలు. ఈ ముగ్గురూ ఆ దేశంలోనే చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు(Sisters) ఫ్రాన్స్‌ దేశానికి చెందిన జార్జ్‌, రామ్‌కుమార్‌, మజ్జూ అనే యువకులను ప్రేమించారు. వీరి ప్రేమకు ఇరువైపు కుటుంబాల వారు పచ్చజెండా ఊపారు. దీంతో మాసిలామణి తన కుటుంబ సంప్రదాయం ప్రకారం తిరుచెందూరులోని కులదైవమైన సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈ మూడు జంటలకు ముచ్చటగా తమిళ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. ఈ నూతన వధూవరులను ఆలయ ప్రధానార్చకులు, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ఆశీర్వదించారు. 

Updated Date - 2022-08-16T15:59:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising