ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదకద్రవ్యాల సాగును నిషేధించిన తాలిబన్

ABN, First Publish Date - 2022-04-04T00:59:39+05:30

అఫ్ఘానిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ సుప్రీం లీడర్ డిక్రీ ఆదివారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఇక నుంచి అఫ్ఘాన్‌లో ఎక్కడా మాదకద్రవ్యాలు, నల్లమందు, ఇతర మత్తు పదార్థాలను సాగు నిషేధం. డిక్రీ ఆదేశాలను అతిక్రమించిన వారిపై షరియా ప్రకారం చర్యలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: ప్రపంచంలోనే అతిపెద్ద గంజాయి ఎగుమతిదారు అయిన అఫ్ఘానిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మాదకద్రవ్యాలు, నల్లమందు లాంటివి సాగు చేయకూడదని అఫ్ఘాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ ఆదేశాలను ఎవరైనా అతిక్రమించి సాగు చేస్తే పంటను ధ్వంసం చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై షరియా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే ఆదేశాల్లో మత్తు పదార్థాలను రవాణా చేయడం, నిల్వ చేయడంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.


‘‘అఫ్ఘానిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ సుప్రీం లీడర్ డిక్రీ ఆదివారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఇక నుంచి అఫ్ఘాన్‌లో ఎక్కడా మాదకద్రవ్యాలు, నల్లమందు, ఇతర మత్తు పదార్థాలను సాగు నిషేధం. డిక్రీ ఆదేశాలను అతిక్రమించిన వారిపై షరియా ప్రకారం చర్యలు తీసుకోబడతాయి’’ అని తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అకుండ్‌జాదా ఆదివారం ప్రకటించారు. వాస్తవానికి అంతర్జాతీయ చట్టబద్ధతను కోరుకున్న ఆప్ఘాన్, 2000లో పాలన ముగిసే నాటికి మాదకద్రవ్యాల సాగును నిషేధించారు. అయితే అనంతరం మారిన పరిస్థితుల కారణంగా మళ్లీ సాగు చేయడం ప్రారంభించారు.

Updated Date - 2022-04-04T00:59:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising