ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indias hijab వివాదంపై స్పందించిన తాలిబన్‌లు

ABN, First Publish Date - 2022-02-11T12:55:01+05:30

కర్ణాటక రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసిన హిజాబ్ వివాదంపై అఫ్ఘానిస్థాన్ దేశంలోని తాలిబన్లు స్పందించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ (అప్ఘానిస్థాన్): కర్ణాటక రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసిన హిజాబ్ వివాదంపై అఫ్ఘానిస్థాన్ దేశంలోని తాలిబన్లు స్పందించారు.కర్ణాటకలో హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలకు తాలిబన్లు మద్ధతు ప్రకటించారు. కర్ణాటక ముస్లిం అమ్మాయిలు ఇస్లామిక్ విలువల కోసం నిలబడ్డారని తాలిబన్లు వారిని ప్రశంసించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం బాలికలు తమ మతపరమైన ఇస్లామిక్ విలువను కాపాడుకునే మార్గాల్లో త్యాగాలు చేశారని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘానిస్థాన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగాని ట్వీట్ చేశారు.కర్నాటకలో అల్లాహు అక్బర్ నినాదాలు చేసిన నల్ల బురఖా ధరించిన అమ్మాయి చిత్రాన్ని సమంగాని షేర్ చేశారు.


కర్నాటకలోని ముస్లిం బాలికలు 'లౌకికవాదం' కోసం నిరసనలు చేస్తున్నారని సలీమ్ జావేద్ అనే పాకిస్థానీ చేసిన ప్రతిస్పందనపై కూడా అతను తీవ్రంగా ప్రతిస్పందించాడు.హిజాబ్ ధరించిన అమ్మాయిలను ఖతార్ అధికారిక ప్రతినిధి సుహైల్ షాహీన్ వంటి సీనియర్ తాలిబన్ అధికారులు సమర్ధించారు.తమ కాలేజీ డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘిస్తూ హిజాబ్ ధరించాలని డిమాండ్ చేస్తున్న ముస్లిం బాలికలకు తాలిబన్లు మద్దతు ప్రకటించారు.


Updated Date - 2022-02-11T12:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising