ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగం కోల్పోయిన స్వీపర్.. డాక్టర్‌కు అశ్లీల ఫొటోలు

ABN, First Publish Date - 2022-02-23T23:21:53+05:30

అందుకే తాను సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఫిర్యాదు చేసిన డాక్టర్ తెలిపారు. ప్రవర్తన బాగోలేదని జైశ్వాల్‌ను ఫిబ్రవరి 21న ఉద్యోగం నుంచి తొలగించారని, అనంతరం తనకు అశ్లీల ఫొటోలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఉద్యోగం కోల్పోయిన ఒక స్వీపర్(22) తాను పని చేసిన ఆసుపత్రిలోని మహిళా డాక్టర్‌(30)కు అశ్లీల ఫొటోలు పంపించాడు. ఫొటోలతో పాటు కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలను కూడా షేర్ చేశాడు. ముంబైలోని బాంద్రాలో జరిగిందీ సంఘటన. నిందితుడిపై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.


వివరాల్లోకి వెళితే.. ప్రిన్స్ జైశ్వాల్ అనే వ్యక్తి ముంబైలోని ఒక మున్సిపల్ ఆసుపత్రిలో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఆసుపత్రిలోని డాక్టర్లకు ఇతర సిబ్బందికి తరుచూ ఫోన్లు చేస్తుంటాడని, అయితే అతడు ఆఫీస్ నంబర్ నుంచి కాకుండా తన పర్సనల్ నంబర్ నుంచి ఫోన్ చేస్తుంటాడని, ఈ విషయమై అనేక సార్లు హెచ్చరికలు చేసినట్లు ఒక డాక్టర్ తెలిపారు. ఫోన్ చేసి అభ్యంతకరంగా మాట్లాడతాడని, మహిలా సిబ్బందితో అశ్లీలంగా మాట్లాడతారని వారు పేర్కొన్నారు.


అందుకే తాను సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఫిర్యాదు చేసిన డాక్టర్ తెలిపారు. ప్రవర్తన బాగోలేదని జైశ్వాల్‌ను ఫిబ్రవరి 21న ఉద్యోగం నుంచి తొలగించారని, అనంతరం తనకు అశ్లీల ఫొటోలు, అసభ్యకరమైన వ్యాఖ్యలను పంపినట్లు ఆమె పేర్కొన్నారు. కాగా, నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 354, 67-ఏ లతో పాటు ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు బాంద్రా పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-02-23T23:21:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising