ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JDU-mukt Manipur: బీహార్ సీఎం నితీష్‌కుమార్‌కు బీజేపీ షాక్

ABN, First Publish Date - 2022-09-03T17:26:46+05:30

మణిపూర్(Manipur) రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ(BJP) జనతాదళ్(యునైటెడ్)కు షాక్ ఇచ్చింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణిపూర్ కమలం గూటిలో చేరిన జేడీ(యూ) పార్టీ ఎమ్మెల్యేలు

పాట్నా(బీహార్): మణిపూర్(Manipur) రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ(BJP) జనతాదళ్(యునైటెడ్)కు షాక్ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో బీజేపీకి జేడీ(యూ)కు చెందిన నితీష్ కుమార్(Nitish Kumar's party) పార్టీతో ఉన్న మైత్రీ బంధం ఇటీవల తెగిపోయిన నేపథ్యంలో మణిపూర్ లో జేడీయూకు చెందిన(Janata Dal United MLAs) ఐదుగురు ఎమ్మెల్యేలను కమలం గూటిలో చేర్చుకోవడం సంచలనం రేపింది. మణిపూర్ లో జేడీయూకు(Manipur JD(U) MLAs) ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, ఐదుగురు బీజేపీలోకి ఫిరాయించారు.


 మణిపూర్ రాష్ట్రంలో జేడీయూ ముక్త్(JDU-mukt Manipur) లక్ష్యంతో తమ బీజేపీ పనిచేసిందని బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ(BJP MP Sushil Modi) వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరిన వారిలో జేడీయూకు చెందిన కుముకచమ్ సింగ్ నగుర్ సంగ్లూర్ సనాటే, అచాబ్ ఉద్దీన్, తంఘజం అరుణ్ కుమార్, ఎల్ఎం ఖాటీలున్నారు. మణిపూర్ లో ఐదుగురు జేడీ యూ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనమయ్యారని అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. మైత్రీబంధం తెగిన తర్వాత బీజేపీ బీహార్ సీఎం నితీష్ కుమార్ కు రెండోసారి షాక్ ఇచ్చింది. 


అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ ఎమ్మెల్యే టేకి కసో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. 2019 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేలు విజయం సాధించగా వారందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయకండువాలు కప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో 2024 ఎన్నికల్లో కమలం పార్టీని ఓడిస్తామని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ చెప్పారు. 


Updated Date - 2022-09-03T17:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising