ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tripura: లొంగిపోయిన మిలిటెంట్ల నిరసన వాయిదా... సీఎం మాణిక్ సాహాతో చర్చలకు సిద్ధం...

ABN, First Publish Date - 2022-06-04T22:56:29+05:30

త్రిపురలోని జాతీయ రహదారి-8ని ఆదివారం నుంచి నిరవధికంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగర్తల : త్రిపురలోని జాతీయ రహదారి-8ని ఆదివారం నుంచి నిరవధికంగా దిగ్బంధనం చేస్తామని ప్రకటించిన డిప్రైవ్‌డ్ రిటర్నీస్ మువ్‌మెంట్ కమిటీ (DRMC) కాస్త వెనుకకు తగ్గింది. ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో ఈ నెల 14న చర్చలు జరిపేందుకు అంగీకారం తెలిపింది. అగర్తల ప్రెస్ క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో DRMC నేత అమృత్ రియాంగ్ ఈ వివరాలను తెలిపారు. 


ఈ నెల 14న ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో తాము సమావేశమవుతామని అమృత్ రియాంగ్ తెలిపారు. ఎన్‌హెచ్-8ను నిరవధికంగా దిగ్బంధనం చేయాలనే నిర్ణయాన్ని కొద్ది రోజులపాటు వాయిదా వేస్తున్నామని చెప్పారు. తాము లొంగిపోయినపుడు తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ఇప్పటి వరకు అమలుకాని హామీల గురించి మే 31న గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను కలిసినప్పటికీ, సరైన ఫలితం రాలేదని చెప్పారు. తమకు పునరావాసం కల్పించడంలో విఫలమైనందుకు నిరసనగా ఈ నెల 5 ఆదివారం నుంచి పశ్చిమ త్రిపురలోని చంపక్ నగర్‌ గుండా వెళ్ళే ఎన్‌హెచ్-8ను దిగ్బంధనం చేయాలని నిర్ణయించామన్నారు. అయితే ముఖ్యమంత్రితో చర్చించేందుకు అవకాశం వచ్చింది కాబట్టి తాము ఈ నిరసన కార్యక్రమాన్ని కొద్ది రోజులపాటు వాయిదా వేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి తమకు సరైన హామీలు ఇస్తే తాము నిరసనను విరమించుకుంటామని తెలిపారు. తమ చర్చలు విఫలమైతే, జూన్ 21 నుంచి ఎన్‌హెచ్-8ను దిగ్బంధనం చేస్తామన్నారు. మాణిక్ సాహాతో సమావేశం ఏదో ఓ కారణంతో రద్దయినా తమ నిరసన కొనసాగుతుందన్నారు. 


అస్సాం-త్రిపుర మధ్య ఉన్న ఎన్‌హెచ్-8 త్రిపురకు జీవన రేఖ. 


Updated Date - 2022-06-04T22:56:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising