ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యపాన నిషేధంపై విచారణకు సుప్రీం నో

ABN, First Publish Date - 2022-09-12T19:40:00+05:30

జాతీయ స్థాయిలో మద్య నిషేధ(Alcohol prohibition) విధానాన్ని తీసుకువచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Delhi : జాతీయ స్థాయిలో మద్య నిషేధ(Alcohol prohibition) విధానాన్ని తీసుకువచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు(Supreme Court) విముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రాలు తమంతట తాముగా నియంత్రిస్తున్నందున జాతీయ స్థాయి(National wide)లో మద్యపాన నిరోధక విధానాన్ని రూపొందించేలా కేంద్రా(Central Government)నికి తగిన ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌(UU Lalith) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మద్యం విధానం... కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉందని, రాష్ట్రాలు తమ సొంత చట్టాలను రూపొందించుకుంటాయని... కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మద్యం విధానం, ప్రభుత్వ ఆదాయ మార్గంతో అనుసంధానమై ఉంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా జరిగితే... ప్రభుత్వ ఆదాయాన్ని నియంత్రిస్తారని సీజేఐ(CJI) పేర్కొన్నారు. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని... సామాజిక ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుందన్నారు.


ఈ అభ్యర్ధన ప్రభుత్వానికి ఒక విధానాన్ని కలిగి ఉండాలని నిర్దేశించడం లాంటిదన్నారు. ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని సీజేఐ స్పష్టం చేశారు. విచారణలో అనేక నివేదికలను ఉదహరించడం, దీనికి కేంద్రం మరోలా స్పందించడం.. ఈ రకమైన విషయాలు వినోదభరితంగా ఉంటాయని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడం సబబు అనిపించడం లేదన్నారు. మీకు కావలసినది మీరు చేయవచ్చని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం ఏమనుకుంటుందో తెలుసుకోవడం ముఖ్యమని... అందుకు నోటీసులు ఇవ్వాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అప్పుడేం జరుగుతుంది? ఇది ఎక్కడ ముగుస్తుందని న్యాయవాదిని ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రభట్‌ ప్రశ్నించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు ధర్మాసనం అవకాశం ఇచ్చింది.

Updated Date - 2022-09-12T19:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising