ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tamilnadu ప్రభుత్వానికి సుప్రీం షాక్..

ABN, First Publish Date - 2022-08-29T18:10:32+05:30

దేవాలయాల(Temples)ను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై తమిళనాడు ప్రభుత్వా(Tamilnadu Government)నికి సుప్రీంకోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Supreme Court : దేవాలయాల(Temples)ను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై తమిళనాడు ప్రభుత్వా(Tamilnadu Government)నికి సుప్రీంకోర్టు (Supreme Court)నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడాన్ని మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి(Subrahmanya Swamy) సవాలు చేశారు. సుబ్రమణ్య స్వామి పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ జరిపి.. తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించడంపై కూడా స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం(Supreme Court) నోటీసులు జారీ చేసింది. 


తమిళనాడు ప్రభుత్వం, ఆలయాల నిర్వాహకుల(Temples Managements) మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. తమిళనాడు(Tamilnadu)లో దీక్షితుల నిర్వహణలో వందలాది ఆలయాలున్నాయి. చిదంబరం ఆలయాల్లో(Chidambaram Temples) దీక్షితులదే నిర్వహణ బాధ్యత. అయితే ఇప్పటి వరకూ దేవాదాయ శాఖ జోక్యం చేసుకోలేదు. అయితే దేవాలయాల అధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఉన్న ఆలయ ఆస్తుల లెక్కించాలని స్టాలిన్ ప్రభుత్వ(Stalins government) నిర్ణయం తీసుకోవడం వివాదానికి కారణమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అధీనాధిపతులు, దీక్షితులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యవహారమంతా చినికి చినికి గాలివానగా మారడంతో సుబ్రహ్మణ్య స్వామి(Subrahmanya Swamy) సుప్రీంకోర్టులో దేవాలయాల స్వాధీనంపై పిటిషన్ వేశారు. 


Updated Date - 2022-08-29T18:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising