ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Noteban exercise : కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్... పెద్ద నోట్ల రద్దు ప్రక్రియపై విచారణ...

ABN, First Publish Date - 2022-10-12T21:12:46+05:30

పెద్ద నోట్ల రద్దు కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన కసరత్తుపై సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై నవంబరు 9న విచారణ జరుపుతామని తెలిపింది. 


పెద్ద నోట్లను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకునేందుకు చేసిన కసరత్తుకు సంబంధించిన అన్ని వివరాలతో అఫిడవిట్లను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ రిజర్వు బ్యాంకును సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం నవంబరు 9న విచారణ జరుపుతుందని తెలిపింది. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబరు 8న పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. దీనిని వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై సెప్టెంబరు 28న విచారణ జరిగింది. అటార్నీ జనరల్ ఆర్ వేంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈ అంశం విద్యా సంబంధిత అంశంగా మారిందని, పెద్ద నోట్లను రద్దు చేసి ఆరేళ్లు గడిచిపోయిందని అన్నారు. వెంటనే సీనియర్ అడ్వకేట్లు పి చిదంబరం, శ్యామ్ దివాన్ పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటుపై సవాలు చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉందన్నారు. కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా కరెన్సీ నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఈ సమస్య భవిష్యత్తుకు కూడా సంబంధించినదని పేర్కొన్నారు. 


పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ బీవీ నాగరత్న రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. 


Updated Date - 2022-10-12T21:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising