ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gyanvapi Mosque కేసు వాదనలు రేపటికి వాయిదా

ABN, First Publish Date - 2022-05-19T17:14:21+05:30

జ్ఞానవాపి మసీదు (Gyanvapi Mosque) కేసుపై వాదనలు సుప్రీంకోర్టులో గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే హిందూ విశ్వాసుల తరపున వాదనలు వినిపించే లాయర్ హరిశంకర్‌ జైన్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే దీనికి ముందు ముస్లింల తరపు న్యాయవాది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు (Gyanvapi Mosque) కేసుపై వాదనలు సుప్రీంకోర్టులో గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే హిందూ విశ్వాసుల తరపున వాదనలు వినిపించే లాయర్ హరిశంకర్‌ జైన్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే దీనికి ముందు ముస్లింల తరపు న్యాయవాది హుజేఫా అహ్మది వాదనలు వినిపిస్తూ దేశవ్యాప్తంగా అనేక వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై విచారించాల్సిన అత్యవసరం ఉందని, అది ఈరోజే జరగాలని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ట్రయల్ కోర్టు ముందు విచారణలు నేటికి పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, సినియర్ లాయర్ హరిశంకర్‌ జైన్ ఆరోగ్యం బాగాలేదని, విచారణను రేపటికి వాయిదా వేయాలని విష్ణు శంకర్ జైన్ కోర్టుకు విజ్ణప్తి చేశారు. రేపు విచారణ జరుపుతామని జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుపై రేపు మధ్యాహ్నం 3 గం.ల నుంచి విచారణ చేపట్టనున్నారు. ఈ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించే వరకు వారణాసి దిగువ కోర్టు విచారణ నిలుపుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

Updated Date - 2022-05-19T17:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising