ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు ఊరట

ABN, First Publish Date - 2022-08-17T22:28:17+05:30

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ (Hemant Soren)కు సుప్రీంకోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ (Hemant Soren)కు సుప్రీంకోర్టులో బుధవారం ఊరట లభించింది. ఆయనకు బూటకపు కంపెనీలు ఉన్నాయని, ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని, ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) చేత దర్యాప్తు చేయించాలని జార్ఖండ్ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిల్స్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు)పై తదుపరి చర్యలను నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 


ఈ పిల్స్‌ను శివశంకర్ శర్మ దాఖలు చేశారు. వీటిని జార్ఖండ్ హైకోర్టు జూన్ 3న విచారణకు స్వీకరించింది. గనుల లీజులను అక్రమంగా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. 2010లో గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కాంట్రాక్టుల మంజూరుపై కూడా దర్యాప్తు జరిపించాలని కోరారు. 


ఈ పిటిషన్లపై విచారణను నిలిపేయాలని జార్ఖండ్ ప్రభుత్వంతోపాటు సొరేన్ కూడా అపీలు చేశారు. ఈ అపీళ్ళపై జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఈ పిల్స్‌పై విచారణ జరపరాదని ఆదేశించింది. 


Updated Date - 2022-08-17T22:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising