ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ED, CBI chiefs’ tenure extension : కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు

ABN, First Publish Date - 2022-08-02T22:00:15+05:30

కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ఈడీ) చీఫ్‌ల పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) విచారణకు చేపట్టింది. ఈ పిటిషన్లపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.


సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం (Union Government) 2021 నవంబరు 15న ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లను సవరించింది. సీబీఐ, ఈడీ చీఫ్‌ల నియామకాల నిబంధనలను సవరించింది. ఈడీ డైరెక్టర్ నియామకం, పదవీ కాలాలకు వర్తించే సీవీసీ చట్టంలోని సెక్షన్ 25ను సవరించింది. 


కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జీవాలా (Randeep Singh Surjewala), టీఎంసీ నేతలు మహువా మొయిత్రా (Mohua Moitra), సాకేత్ గోఖలే (Saket Gokhale) తదితరులు ఈ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 1984 బ్యాచ్ ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (IRS)  అధికారి సంజయ్ కుమార్ మిశ్రాను నిర్ణీత రెండేళ్ళ పదవీ కాలానికి ఈడీ డైరెక్టర్‌గా 2018 నవంబరులో నియమించారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన పదవీ కాలాన్ని 2021 నవంబరు వరకు పొడిగించారని తెలిపారు. ఈ పొడిగింపును కామన్ కాజ్ అనే ఎన్జీవో సుప్రీంకోర్టులో సవాలు చేసిందన్నారు. ఇప్పుడు ఆయన పదవీ కాలాన్ని పొడిగించే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ సవరణలను చేపట్టిందని ఆరోపించారు. 


సుర్జీవాలా తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈడీ కేవలం మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ప్రకారం నేరాలను మాత్రమే కాకుండా విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ప్రకారం నేరాలను కూడా దర్యాప్తు చేస్తుందన్నారు. సీబీఐ డైరెక్టర్, ఈడీ డైరెక్టర్ నియామక విధానాలు వేర్వేరుగా ఉంటాయన్నారు. సీవీసీ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ఈడీ డైరెక్టర్‌ను నియమిస్తారన్నారు. చీఫ్ విజిలెన్స్ కమిషనర్, విజిలెన్స్ కమిషనర్లు, బ్యూరోక్రాట్లతో కూడిన కమిటీ ఈడీ డైరెక్టర్‌ను నియమిస్తుందని తెలిపారు. ఈ కమిటీ ప్రతినిధులంతా బ్యూరోక్రాట్లే కాబట్టి ఈడీ డైరెక్టర్‌ను ఎవరు నియమిస్తున్నారనే అంశాన్ని లోతుగా పరిశీలించడం చాలా ముఖ్యమని తెలిపారు. 


మిశ్రా పదవీ కాలాన్ని ఇక పొడిగించరాదని సుప్రీంకోర్టు సెప్టెంబరు 8న ఆదేశించింది. పొడిగించిన పదవీ కాలం 2021 నవంబరుతో ముగిసిపోతోంది కాబట్టి ప్రస్తుతానికి దానిలో జోక్యం చేసుకోబోనని తెలిపింది.  ఈ ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పొడిగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని పిటిషనర్లు ఆరోపించారు. 


కామన్ కాజ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, కొన్ని నేరాలపై దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నందువల్ల మిశ్రాను కొనసాగించడం తప్పనిసరి అని తెలిపింది. 


Updated Date - 2022-08-02T22:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising