ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు ప్రజాస్వామ్యానికి చేటు : సుప్రీంకోర్టు...

ABN, First Publish Date - 2022-01-12T02:49:58+05:30

మహారాష్ట్ర శాసన సభ 2021 జూలైలో భారతీయ జనతా పార్టీకి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మహారాష్ట్ర శాసన సభ 2021 జూలైలో భారతీయ జనతా పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఓ ఏడాదిపాటు సస్పెండ్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ చర్య ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. శాసన సభకు రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని పేర్కొంది. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే సభ్యుని పదవికి ఏర్పడే ఖాళీని భర్తీ చేయవలసిన చట్టబద్ధ బాధ్యత ఉందని, ఆరు నెలల్లోగా భర్తీ చేయడం సమంజసమని, అంతకు మించి అయితే రాజ్యాంగ విరుద్ధమవుతుందని తెలిపింది. జస్టిస్ ఏఎం కన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 


తమను ఓ ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర శాసన సభ 2021 జూలై 5న చేసిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ 12 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా మంగళవారం అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సభ్యుడిని సస్పెండ్ చేసే అధికారం సభకు ఉందనే వాదనతో ఏకీభవించినప్పటికీ, ఓ సంవత్సరంపాటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం లేకుండా, ఖాళీగా ఉంచడం ద్వారా రాజ్యాంగపరమైన శూన్యతను సృష్టించకూడదని ధర్మాసనం తెలిపింది. 


ఈ ఎమ్మెల్యేలు సభలో తప్పుగా ప్రవర్తించారని, ప్రిసైడింగ్ ఆఫీసర్ భాస్కర్ జాదవ్‌పై దుర్భాషలాడారని ఆరోపిస్తూ శాసన సభ ఈ తీర్మానం చేసింది. 


Updated Date - 2022-01-12T02:49:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising