ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AIADMK row: పన్నీర్‌సెల్వం పిటిషన్‌పై విచారణ మద్రాస్ హైకోర్టులో : సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2022-07-29T21:15:05+05:30

ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) నుంచి తనను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) నుంచి తనను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్‌సెల్వం (OPS) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ బాధ్యతను మద్రాస్ హైకోర్టు (Madras High Court)కు సుప్రీంకోర్టు (Supreme Court)  శుక్రవారం అప్పగించింది. మూడు వారాల్లోగా దీనిపై తీర్పు చెప్పాలని తెలిపింది. పార్టీలో యథాతథ పరిస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. 


ఏఐఏడీఎంకే పార్టీ వ్యవహారాల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆ పార్టీలోని ఎడపాడి పళనిస్వామి  (Edapadi Palanisamy), పన్నీర్‌సెల్వం (O Pannerselvam)  వర్గాలను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ (CJI Justice NV Ramana) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 


జూలై 11న ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ద్వంద్వ నాయకత్వం విధానానికి ముగింపు పలికింది. పళనిస్వామిని పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించింది. పన్నీర్‌సెల్వం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. 


ఇదిలావుండగా, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయం తాళాలను ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి అప్పగించాలని మద్రాస్ హైకోర్టు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్  (ఆర్డీవో)ను బుధవారం ఆదేశించింది. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు ఈ కార్యాలయంపై నియంత్రణ కోసం హింసాత్మక చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఆర్డీవో ఈ కార్యాలయాన్ని సీలు చేశారు. ఈ తాళాలను పళనిస్వామికి అప్పగించాలని హైకోర్టు ఈ ఆదేశించింది. 


జూలై 11న జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో పళనిస్వామి ఆ పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. అదే రోజు ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం వర్గం పార్టీకి సంబందించిన విలువైన పత్రాలను దొంగిలించిందని పళనిస్వామి వర్గం ఆరోపించింది. రూ.32,000 నగదుతోపాటు సుమారు 30 వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను దొంగిలించారని ఆరోపించింది. ఈ ఆరోపణలతో చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Updated Date - 2022-07-29T21:15:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising