ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లితో మాట్లాడాలని పదహారేళ్ల అమ్మాయికి గట్టిగా చెప్పగలమా? : సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2022-01-18T20:40:50+05:30

పదహారేళ్ళ అమ్మాయి తన తల్లితో మాట్లాడటానికి ఇష్టపడకపోతే, తన తండ్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఓ పదహారేళ్ళ అమ్మాయి తన తల్లితో మాట్లాడటానికి ఇష్టపడకపోతే, తన తండ్రి వద్ద తాను సురక్షితంగా ఉన్నానని భావిస్తే, అటువంటి అమ్మాయిని తన తల్లితో మాట్లాడాలని న్యాయస్థానం నిర్బంధించగలదా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అమెరికావాసి అయిన తల్లికి ఈ ప్రశ్నను సంధించింది. తనను వదిలిపెట్టిన తన భర్త తమ కుమార్తెలిద్దరినీ రహస్యంగా భారత దేశానికి తీసుకెళ్ళిపోయి, వారి మనసుల్లో విషం నింపుతున్నారని ఆమె ఆరోపించారు. 


పిటిషనర్ పార్శీ మతస్థురాలు. ఆమె అమెరికాలో నివసిస్తున్నారు. ఆమె తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఆమె తన భర్త నుంచి విడాకులు కోరుతూ అమెరికా కోర్టులో 2017లో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారిని భారత దేశానికి తీసుకెళ్తానని, రెండు వారాల్లోగా తిరిగి తీసుకొస్తానని ఆమె భర్త అమెరికన్ కోర్టుకు హామీ ఇచ్చారని చెప్పారు. ఆ ఇద్దర్నీ ఆమె భర్త 2019 ఆగస్టులో భారత దేశానికి తీసుకొచ్చారని తెలిపారు. అప్పట్లో ఆ ఇద్దరి వయసులు 15 ఏళ్ళు, పదమూడేళ్లు అని వివరించారు. వారిని భారత దేశానికి తీసుకొచ్చిన తర్వాత వారు తమ తల్లితో మాట్లాడటం లేదన్నారు. ఫోన్‌లో కానీ, వీడియో కాల్ ద్వారా కానీ వారితో కనీసం మాట్లాడటానికి సైతం తల్లి తీవ్ర సంఘర్షణను ఎదుర్కొనవలసి వస్తోందని తెలిపారు. 


భర్త తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ భట్నాగర్ వాదనలు వినిపిస్తూ, ఒక కుమార్తెకు మెజారిటీ వయసు వచ్చిందని, ఆమె విదేశాల్లో చదువుకుంటోందని, మరొక కుమార్తె వయసు పదహారేళ్ళు అని తెలిపారు. వీరిద్దరూ తమ తల్లితో మాట్లాడాలని కోరుకోవడం లేదని, అందువల్ల పిటిషనర్ భర్త చేయగలిగినదేమీ లేదని చెప్పారు. 


ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమ కొహ్లీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ కేసులో చిన్న అమ్మాయి వయసు పదహారేళ్ళు అని, ఈ రోజుల్లో పదహారేళ్ళు, అంతకన్నా ఎక్కువ వయసుగలవారు తమకు ఏది మంచిదో నిర్ణయించుకోగలరని ధర్మాసనం పేర్కొంది. పదహారేళ్ల వయసున్నవారికి తండ్రి ఏదైనా చెప్పగలరని అనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. గత ఏడాదిలో ఎన్నిసార్లు మీ కుమార్తెలతో మాట్లాడేందుకు ప్రయత్నించారని తల్లిని ప్రశ్నించింది. పిల్లల చేయి పట్టుకుని, తల్లితో మాట్లాడాలని నిర్బంధించజాలమని తెలిపింది. అయితే పిల్లలు సరైన నిర్ణయం తీసుకున్నదీ, లేనిదీ మాత్రమే నిర్ణయించగలమని తెలిపింది. తల్లి, ఇద్దరు కుమార్తెల మధ్య వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయగలరా? అని భర్తను అడిగింది. 


భట్నాగర్ మాట్లాడుతూ, తన క్లయింట్ (భర్త) బుధవారం స్వచ్ఛందంగానే వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేస్తారని, దీని కోసం ఎటువంటి ఆదేశాలను జారీ చేయవలసిన అవసరం లేదని చెప్పారు. 


Updated Date - 2022-01-18T20:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising