ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రస్తుత EWS, OBC కోటా ప్రకారమే NEET-PG Counselling : సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2022-01-07T23:12:19+05:30

ప్రస్తుతం అమల్లో ఉన్న EWS, OBC కోటా ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రస్తుతం అమల్లో ఉన్న EWS, OBC కోటా ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో NEET-PG admissions కోసం మెడికల్ కౌన్సెలింగ్‌‌ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది. ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ)లకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించే విధానాన్ని సమర్థిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ తీర్పును రెసిడెంట్ డాక్టర్ల సంఘాల సమాఖ్య (FORDA) స్వాగతించింది. 


ఈ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడానికి కారణాలను తెలియజేస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఇప్పటికే ప్రకటించిన విధానం ప్రకారం 2021-22 విద్యా సంవత్సరం కోసం NEET-PG మెడికల్ కౌన్సెలింగ్ జరుగుతుందని పేర్కొంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS)కు చెందిన అభ్యర్థులకు సంవత్సరాదాయం రూ.8 లక్షలకు మించకూడదనే నిబంధనను భవిష్యత్తులో అమలు చేయడం తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది. తదుపరి విచారణను మార్చి 5న నిర్వహిస్తామని పేర్కొంది. 


పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్స్‌లో EWS కోటా చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం సుదీర్ఘ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతోపాటు నిరసన తెలుపుతున్న రెసిడెంట్ డాక్టర్లు కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని కోరుతున్నారు. దీంతో  జాతీయ ప్రయోజనాల కోసం కౌన్సెలింగ్ ప్రారంభం కావాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బోపన్న ధర్మాసనం తెలిపింది. 


కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులైన అభ్యర్థులంతా ప్రస్తుత విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు పొందారని చెప్పారు. ఈ రిజర్వేషన్ల ప్రకారం సీట్లు పొందిన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కోసం ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. జనరల్ కేటగిరీలోని విద్యార్థుల అవకాశాలకు ఎటువంటి హాని జరగబోదని స్పష్టం చేశారు. 


FORDA అధ్యక్షుడు డాక్టర్ మనీశ్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు తమకు గొప్ప ఊరట అని చెప్పారు. దేశంలో కోవిడ్-19 మహమ్మారి మూడో ప్రభంజనం ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వైద్యులందరికీ చాలా విలువైనదని తెలిపారు. NEET-PG counselling షెడ్యూలు త్వరలోనే విడుదలవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2022-01-07T23:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising