ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే రెండు వారాల పాటు వర్చువల్‌గానే విచారణ: సుప్రీం

ABN, First Publish Date - 2022-01-03T07:57:02+05:30

ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వచ్చే రెండు వారాల పాటు విచారణను వర్చువల్‌గా నిర్వహించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ మేరకు ఆదివారం సర్క్యులర్‌ను అత్యున్నత న్యాయస్థానం జారీ చేసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 2: ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వచ్చే రెండు వారాల పాటు విచారణను వర్చువల్‌గా నిర్వహించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ మేరకు ఆదివారం సర్క్యులర్‌ను అత్యున్నత న్యాయస్థానం జారీ చేసింది. ప్రామాణిక పనితీరు విధానం(ఎ్‌సఓపీ) గురించి గత ఏడాది అక్టోబరు 7న జారీ చేసిన సర్క్యులర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అందులో పేర్కొంది. మహమ్మారి కారణంగా.. 2020 మార్చి నుంచీ సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలోనే కేసుల్ని విచారించింది. అయితే.. బార్‌ సంఘాలు, న్యాయవాదుల డిమాండ్‌ మేరకు గత ఏడాది అక్టోబరు 7న కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. సుదీర్ఘ విచారణ అవసరమైన కేసులను బుధ, గురువారాల్లో ప్రత్యక్షంగా కోర్టులోనే చేపడతామని అందులో స్పష్టం చేసింది. ప్రస్తుతం కేసుల పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేసింది.

Updated Date - 2022-01-03T07:57:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising