ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే 23లోగా సూపర్‌టెక్ ట్విన్ టవర్ల కూల్చివేత

ABN, First Publish Date - 2022-02-28T23:33:56+05:30

రియల్ ఎస్టేట్ డవలపర్ 'సూపర్‌టెక్' అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్ల కూల్చివేతను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డవలపర్ 'సూపర్‌టెక్'  అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్ల కూల్చివేతను మే 23లోగా పూర్తి చేస్తామని నొయిడా అధికారులు సుప్రీంకోర్టుకు సోమవారంనాడు తెలియజేశారు. నొయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే మొదలైందని అధికారుల తరఫున సీనియర్ న్యాయవాది రవీంద్ర కుమార్ కోర్టుకు వివరించారు. ఇందుకు సంబంధించిన ఒక అఫిడవిట్‌ను సమర్పించారు. దీనిపై న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ, అఫిడవిట్‌లో సమర్పించిన టైమ్‌లైన్‌ను కచ్చితంగా అధికారులంతా పాటించాలని ఆదేశించింది. కూల్చివేత అనంతరం శిథిలాలను ఆగస్టు 22లోగా తొలగించాలని కూడా స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 17కు వాయిదా వేసింది. ఆరోజు స్థాయీ నివేదికను కోర్టుకు సమర్పించాలని పేర్కొంది.


రియల్ ఎస్టేట్ మేజర్ సూపర్‌టెక్ లిమిటెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్లను కూల్చివేయాలని ఫిబ్రవరి 7న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ట్విన్ టవర్స్‌లో ఇళ్లు కొనుకున్న వారందరికీ ఫిబ్రవరి 23లోగా సొమ్ము మొత్తం తిరిగి ఇచ్చివేయాలని కూడా స్పష్టం చేసింది. సొమ్ములు రిఫండ్ చేయమని తాము ఇచ్చిన గత ఆదేశాలను పట్టించుకోకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుతో చెలగాటమాడితే డైరెక్టర్లను జైలుకు పంపుతామని కూడా హెచ్చరించింది.

Updated Date - 2022-02-28T23:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising