ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Superhuman app : 22 శాతం సిబ్బందికి ఉద్వాసన

ABN, First Publish Date - 2022-06-06T00:03:16+05:30

ఈ-మెయిల్ కమ్యూనికేషన్‌ను వేగవంతం చేసే సూపర్‌హ్యూమన్ అప్లికేషన్ (స్టార్టప్ కంపెనీ)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా : ఈ-మెయిల్ కమ్యూనికేషన్‌ను వేగవంతం చేసే సూపర్‌హ్యూమన్ అప్లికేషన్ (స్టార్టప్ కంపెనీ) 22 శాతం మంది సిబ్బందిని తొలగించింది. ఈ కంపెనీ వ్యాపారం క్షీణించిందని, ఈ క్షీణత మరికొద్ది సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉందని, అందువల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని, ఈ స్టార్టప్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ వోహ్రా శనివారం ట్విటర్ వేదికగా తెలిపారు. 


ఈ యాప్‌ను మరింత మెరుగుపరచేందుకు, మరిన్ని ఫీచర్లను చేర్చేందుకు 2021 ఆగస్టులో 75 మిలియన్ డాలర్లను ఈ స్టార్టప్ కంపెనీ సిరీస్ సీ రౌండ్‌లో సేకరించింది. సూపర్‌హ్యూమన్ టీమ్‌లో 22 శాతం మందిని తొలగించాలని నిర్ణయించినట్లు తెలియజేయడానికి విచారిస్తున్నానని వోహ్రా ఇచ్చిన ట్వీట్‌లో తెలిపారు. అద్భుతమైన ప్రతిభగల 23 మందికి గుడ్‌బై చెబుతున్నామన్నారు. వ్యాపార క్షీణత దిశగా తమ కంపెనీ వెళ్తోందని, ఈ పరిస్థితి మరికొద్ది సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. తమ విజన్‌ను నిలకడగా సాకారం చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 


తమ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోయినవారిని ఆదుకోవాలని ప్రస్తుతం నియామకాలు చేపడుతున్న కంపెనీలను కోరారు. ఈ ఉద్యోగులకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. ఆరోగ్య బీమా, మానసిక ఆరోగ్యం, దాతృత్వం, ఉద్యోగ అన్వేషణ వంటివాటిలో ఈ ఏడాదంతా సహకరిస్తామన్నారు. 


Updated Date - 2022-06-06T00:03:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising