ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP MLA harassment ..నలుగురు ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2022-06-15T17:24:28+05:30

కర్ణాటక రాష్ట్రంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే వేధింపుల కారణంగా నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే వేధింపుల కారణంగా నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హవేరీ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్‌, ఆయన కుమారులు తమను వేధించారని ఆరోపిస్తూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.పాండప్ప లమాని (70), గురుచప్ప లమాని (72), గంగవ్వ కబ్బూరు (65), హనునాథప్ప (41) తమకున్న సాగు భూమిలో విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. వారందరినీ చికిత్స నిమిత్తం దావణగెరె ఆసుపత్రికి తరలించారు.భూవివాదానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్‌, ఆయన కుటుంబం తమను వేధించినట్లు బాధితులు ఆరోపించారు.


బీజేపీ ఎమ్మెల్యే,అతని కుటుంబం బాధితులకు ఐదు గుంటల  భూమిని తక్కువ ధరకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఆ భూమిని ప్రభుత్వ పథకం కింద రైతులకు కేటాయించింది.ప్రభుత్వ పథకం ద్వారా గ్రామంలో మొత్తం 29 మంది లబ్ధి పొందారు. ఒక్కొక్కరికి ఎకరం 15 గుంటల భూమి లభించింది. ప్రతి ఒక్కరూ తనకు కొంత భూమిని తిరిగి ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.దీనిపై ప్రజలు నిరసన వ్యక్తం చేసి భూమిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు.ఈ భూమిలో సర్వే చేసేందుకు కూడా ఎమ్మెల్యే అధికారులను అనుమతించడం లేదని ప్రజలు ఆరోపించారు. 

Updated Date - 2022-06-15T17:24:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising