ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబర్బన్‌ Trainsలో టీకా సర్టిఫికెట్‌ తప్పనిసరి

ABN, First Publish Date - 2022-01-11T16:10:28+05:30

నగరంలో సబర్బన్‌ విద్యుత్‌ రైళ్లలో కొవిడ్‌ నిబంధనల అమలులో భాగంగా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లు ఉన్నవారినే ప్రయాణానికి అనుమతించే విధానం సోమవారం ఉదయం నుంచి అమలులోకి వచ్చింది. చెన్నై సబర్బన్‌ రైల్వే స్టేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: నగరంలో సబర్బన్‌ విద్యుత్‌ రైళ్లలో కొవిడ్‌ నిబంధనల అమలులో భాగంగా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లు ఉన్నవారినే ప్రయాణానికి అనుమతించే విధానం సోమవారం ఉదయం నుంచి అమలులోకి వచ్చింది. చెన్నై సబర్బన్‌ రైల్వే స్టేషన్‌ నుంచి గుమ్మిడిపూండి, అరక్కోణం, తిరువళ్లూరు, మెరీనాబీచ్‌ వైపు లోకల్‌ విద్యుత్‌ రైళ్లు రోజూ వెళుతుంటాయి. ఈ రైళ్లలో విపరీతంగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ల వ్యాప్తి అధికమవుతుండటంతో రైలు ప్రయాణికుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల 10 నుంచి కరోనా నిరోధక టీకాలు వేసుకున్నవారినే విద్యుత్‌ లోకల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు అను మతిస్తామని అధికారులు ప్రకటించారు. ఆ మేరకు సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ పక్కనే పాత మూర్‌మార్కెట్‌ ప్రాంతంలో ఉన్న సబర్బన్‌ రైల్వే స్టేషన్‌లో ప్రవేశించే ప్రయాణికులను కరోనా టీకాలు వేసుకున్న సర్టిఫికెట్లను సెల్‌ఫోన్‌లో లేదా జిరాక్స్‌ కాపీ ఉంటేనే అనుమతించారు. ఇదే విధంగా కరోనా టీకా లు వేసుకున్నట్లు సర్టిఫికెట్లు ఉంటేనే సీజన్‌ టికెట్లను ఇచ్చే పద్ధతి కూడా సోమవారం ఉదయం నుండి అమలు చేశారు.

Updated Date - 2022-01-11T16:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising