ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వధ ముందు స్టన్నింగ్‌ తప్పనిసరి

ABN, First Publish Date - 2022-04-04T09:00:49+05:30

కోళ్లు, మేకలు, ఇతర జంతువులను మాంసం కోసం వధించే ముందు వాటిని స్టన్నింగ్‌(కరెంటు షాక్‌ తదితరాల ద్వారా అచేతన స్థితికి చేరేలా) చేయడం తప్పనిసరి అని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటకలో కబేళాలు, చికెన్‌ షాపులకు ఆదేశం

బెంగళూరు, ఏప్రిల్‌ 3: కోళ్లు, మేకలు, ఇతర జంతువులను మాంసం కోసం వధించే ముందు వాటిని స్టన్నింగ్‌(కరెంటు షాక్‌ తదితరాల ద్వారా అచేతన స్థితికి చేరేలా) చేయడం తప్పనిసరి అని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని కబేళాలు, చికెన్‌ షాపులకు ఆదేశాలు జారీ చేయాలని బీబీఎంపీ(బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె) ను రాష్ట్ర పశు సంవర్ధకశాఖ ఆదేశించింది. జంతు వ ధ కేంద్రాలు, చికెన్‌ షాపులకు లైసెన్సులు జారీ చేసే ముందు అక్కడ ఉన్న స్టన్నింగ్‌ సౌకర్యాన్ని పరిశీలించాలని నిర్దేశించింది. ఉగాది తర్వాతి రోజైన ఆదివారం కర్ణాటకలో వర్షదోడకు(మాంసాహార పండుగ) నిర్వహించారు. ఈ నేపథ్యంలో హలాల్‌ మాంసాన్ని బహిష్కరించాలని ఆర్‌ఎ్‌సఎస్‌, ఇతర హిందూత్వ సం ఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. జంతువుల పట్ల క్రూరత్వం నివారణ నిబంధనలు-2001ను ఈ ఆదేశాల్లో ప్రభుత్వం ఉటంకించింది. నిబంధనలు పాటించడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపింది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.  


Updated Date - 2022-04-04T09:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising