ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయిపై ఉక్కుపాదం

ABN, First Publish Date - 2022-06-26T18:44:54+05:30

ప్యారీస్‌, జూన్‌ 25: పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ ప్రకటించారు. రాష్ట్రంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాఠశాలలు, కళాశాలల్లో మాదక ద్రవ్యాల పునరావాస కేంద్రాలు

పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌

ప్యారీస్‌, జూన్‌ 25: పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ ప్రకటించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో అడ్డుకొనేలా ‘ఆపరేషన్‌ గంజాయి వేట 2.0’ ప్రత్యేక చర్యలను రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టింది. అందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో గుట్కా, గంజాయి సహా మాదకద్రవ్యాల విక్రయాలు అడ్డుకొనేలా తనిఖీలు చేపట్టి విక్రయిస్తున్న వారిని అరెస్ట్‌ చేసింది. వీరిలో అధికంగా కేసులున్న వారిని గూండా చట్టం కింద అరెస్ట్‌ చేసింది. ఈ చర్యలతో నగరంలో మాదకద్రవ్యాల విక్రయాలు తగ్గినట్లు పోలీసు శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 2019 నుంచి 2021 వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న సుమారు రూ.2 కోట్ల విలువైన 1,300 కిలోల గంజాయి, 30 గ్రాముల హెరాయిన్‌ను చెంగల్పట్టు జిల్లా తెన్‌మంగళం గ్రామంలోని రసాయన ఉత్పత్తుల నిర్మూలనా కేంద్రంలో శనివారం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ మీడియాతో మాట్లాడుతూ... నిందితులను అరెస్ట్‌ చేసే సమయంలో వారు గంజాయి మత్తులో ఉంటున్నారని తెలిపారు. మాదకద్రవ్యాల చెలామణిపై సర్వే, పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కమిషనర్‌ తెలిపారు.

Updated Date - 2022-06-26T18:44:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising