ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర రెవెన్యూ లోటు 550 శాతం!

ABN, First Publish Date - 2022-10-07T09:44:36+05:30

రాష్ట్రప్రభుత్వం 550 శాతం రెవెన్యూ లోటులో ఉందని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయినా కేంద్రం అప్పులిస్తోందా?.. ఆ డబ్బంతా ఏమైపోతోంది?

పోలీసులకు మినహా ఉద్యోగులెవరికీ సకాలంలో వేతనాలివ్వడం లేదు

జగన్‌ సర్కారుపై రఘురామ ఫైర్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) రాష్ట్రప్రభుత్వం 550 శాతం రెవెన్యూ లోటులో ఉందని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ‘ఇంత లోటు ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా అప్పులిస్తోందా? ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి’ అని నిలదీశారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. జగన్‌ సర్కారు ఇప్పటికే 217 శాతం అధికంగా అప్పులు చేసిందని..  లిక్కర్‌ బాండ్ల ద్వారా తెచ్చిన రూ.8 వేల కోట్లను కూడా కలిపితే 550 శాతానికి పెరిగినట్లని తెలిపారు. అయినా ఆర్థికవ్యవస్థ భేషుగ్గా ఉందని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసులకు మినహా మిగతా ప్రభుత్వ ఉద్యోగులెవరికీ సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. జీతాలు, పెన్షన్లకే రూ.5,500 కోట్లు అవసరమని.. అప్పులపై వడ్డీలకు ప్రతి నెలా రూ.8,900 కోట్లు వెచ్చించాలని చెప్పారు. ఇక కేంద్రం నుంచి వివిధ రూపాల్లో వచ్చే ఆదాయం వేరని పేర్కొన్నారు. కేంద్రం కొత్త అప్పులకు అనుమతి ఇవ్వకపోతే.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని, సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే పరిస్థితి లేదని చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని, అస్మదీయులకు మాత్రమే బిల్లుల చెల్లింపులో మినహాయింపు ఉందని విమర్శించారు. రుషికొండలో ముఖ్యమంత్రి ఇల్లు ఎందుకు కట్టుకోకూడదని సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కోర్టుకు  చెప్పిన దాని కంటే ఏడెనిమిది రెట్లు ఎక్కువగా కొండపై నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు.

Updated Date - 2022-10-07T09:44:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising