ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టార్టప్‌ కేపిటల్‌గా తిరుగులేని Bengaluru

ABN, First Publish Date - 2022-07-03T16:41:42+05:30

దేశ స్టార్టప్‌ కేపిటల్‌గా బెంగళూరు తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. రాజధాని బెంగళూరులో 46 యూనికార్న్‌లు ఉండగా తదుపరి స్థానాన్ని ఢిల్లీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                    - మరోసారి స్థానం పదిలం


బెంగళూరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): దేశ స్టార్టప్‌ కేపిటల్‌గా బెంగళూరు తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. రాజధాని బెంగళూరులో 46 యూనికార్న్‌లు ఉండగా తదుపరి స్థానాన్ని ఢిల్లీ 25 యూనికార్న్‌లతోనూ, ముంబై 16 యూనికార్న్‌లతోనూ నిలిచాయి. హరూన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నగరంలో శనివారం ఇండియా ఫ్యూచర్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ను విడుదల చేసింది. దేశంలో రానున్న నాలుగేళ్లలో 122 కొత్త యూనికార్న్‌లు రావచ్చునని అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో 84 యూనికార్న్‌లు, 51 గేజలర్స్‌, 71 చీటాస్‌ ఉన్నాయి. 2021 ఇండెక్స్‌తో పోలిస్తే వీటి ప్రగతి గణనీయంగా పెరగడం గమనార్హం. గత ఏడాది దేశంలో 51 యూనికార్న్‌లు, 32 గేజలర్స్‌, 54 చీటాస్‌ ఉన్న సంగతి తెలిసిందే. దేశపు ఫ్యూచర్‌ యూనికార్న్‌ 49 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 36 శాతం పెరుగుదల ఉండడం గమనార్హం. ఇండెక్స్‌ విడుదల అనంతరం ఏఎ్‌సకే ప్రైవేట్‌ వెల్త్‌ హరూన్‌ ఇండియా సహ సంస్థాపకుడు కైవల్య వొహ్రా మాట్లాడుతూ స్టార్టప్‌ పరుగులో బెంగళూరు అగ్రగామిగా ఉండడంతోపాటు తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుందన్నారు. సంస్థ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ సాలూజా శనివారం మీడియాతో మాట్లాడుతూ అమెరికా, చైనా తర్వాత స్టార్టప్‌ రంగంలో భారత్‌ దూసుకుపోతుండడం శుభపరిణామమన్నారు. ఈ రంగంలో ఆవిష్కరణలు, నైపుణ్యభరిత ఉద్యోగాలకు గణనీయ అవకాశాలు ఉన్నాయని సంస్థ ప్రధాన పరిశోధకుడు అనాస్‌ రెహమాన్‌ మీడియాకు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే యూనికార్న్‌ల ప్రగతి 65 శాతం, గాజెలర్ల ప్రగతి 59 శాతం, చీటాల ప్రగతి 71 శాతం ఉండడం సాధారణ విషయమేమీ కాదన్నారు. స్టార్టప్‌ రంగంలో ఆరోగ్యకరమైన పోటీకి ఈ పరిణామాలు మరింత ఊతమిస్తాయన్నారు. 

Updated Date - 2022-07-03T16:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising