ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Liberia చర్చిలో తొక్కిసలాట...29 మంది మృతి

ABN, First Publish Date - 2022-01-21T13:58:33+05:30

లైబీరియాలోని ఓపెన్-ఎయిర్ పెంటెకోస్టల్ చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు మరణించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన్రోవియా: లైబీరియాలోని ఓపెన్-ఎయిర్ పెంటెకోస్టల్ చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు మరణించారు.లైబీరియా రాజధాని మన్రోవియాలో జరిగిన చర్చిలో  జరిగిన తొక్కిసలాటలో రాత్రికి రాత్రే 29 మంది మరణించినట్లు లైబీరియా డిప్యూటీ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి చెప్పారు.రాజధాని శివార్లలోని పొరుగున ఉన్న న్యూ క్రూ టౌన్‌లో రాత్రి జరిగిన క్రిస్టియన్ ఆరాధన కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగిందని జలవా టోన్‌పో చెప్పారు.ఈ తొక్కిసలాటలో 29 మంది మరణించారని, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారని వైద్యులు చెప్పారు. దోపిడీకి ప్రయత్నించిన గుంపును సాయుధ వ్యక్తుల బృందం వెంటాడటంతో తొక్కిసలాట ప్రారంభమైందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 


చర్చిలో పరుగెత్తుతున్నప్పుడు, కొంతమంది కింద పడిపోయారు. మరికొందరు నేలపై పడటంతో వారిపైనుంచి మరికొందరు నడిచారు.జోగోస్ అని పిలిచే లైబీరియన్ స్ట్రీట్ గ్యాంగ్‌ల బ్యాండ్‌లు కొడవళ్లు, ఇతర చిన్న ఆయుధాలతో దోపిడీలకు పాల్పడుతుంటాయి.ఈ ఘటనకు కారణమేమిటనే దానిపై వ్యాఖ్యానించేందుకు లైబీరియా దేశ పోలీసు ప్రతినిధి మోసెస్ కార్టర్ నిరాకరించారు.ఈ ఘటనపై విచారణ జరుగుతోందని మోసెస్ తెలిపారు.


Updated Date - 2022-01-21T13:58:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising