ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఆపి, కొవిడ్ రూల్స్ పాటించని వారికి మాస్క్ తొడిగిన సీఎం స్టాలిన్

ABN, First Publish Date - 2022-01-04T23:10:42+05:30

హెడ్ క్వార్టర్స్ నుంచి క్యాంప్ ఆఫీసుకు వెళ్తుండగా బహిరంగ ప్రదేశాల్లో కొంత మంది మాస్క్‌లు పెట్టుకోకపోవడం కనిపించింది. వారికి మాస్క్‌లు అందించాను. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలని వారికి సూచించాను. కొవిడ్ భయంకరంగా వ్యాపిస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రెండేళ్లుగా కొవిడ్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయినప్పటికీ కొందరు కొవిడ్ పట్ల జాగ్రత్తగా ఉండడం లేదు. ఇంటి పరిసరాల్లో ఉన్నప్పుడు అలా ఉంచితే బహిరంగ ప్రదేశాల్లో తిరిగేప్పుడు కూడా మాస్క్‌లు ధరించడం లేదు. చెన్నై రోడ్లపై ఇలాంటి వారిని చూసిన స్టాలిన్ వెంటనే తన కాన్వాయ్‌ని ఆపించి, మాస్క్‌లు లేని వారికి ఆయనే స్వయంగా మాస్క్‌లు తొడిగారు. కొవిడ్‌పై వైద్యుల సలహాలను పాటించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్టాలిన్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ ‘‘హెడ్ క్వార్టర్స్ నుంచి క్యాంప్ ఆఫీసుకు వెళ్తుండగా బహిరంగ ప్రదేశాల్లో కొంత మంది మాస్క్‌లు పెట్టుకోకపోవడం కనిపించింది. వారికి మాస్క్‌లు అందించాను. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలని వారికి సూచించాను. కొవిడ్ భయంకరంగా వ్యాపిస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలంటే మాస్క్‌లు ధరించడం చాలా అవసరం. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను విజ్ణప్తి చేసేది ఏంటంటే.. మాస్క్‌లు తప్పకుండా ధరించండి’’ అని అన్నారు.



Updated Date - 2022-01-04T23:10:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising