ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SSC recruitment Scam: అర్పితా ముఖర్జీ ఇంట్లో నల్ల డైరీ లభ్యం

ABN, First Publish Date - 2022-07-27T01:34:25+05:30

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణానికి (teacher recruitment scam) సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (enforcement directorate) సోదాల్లో కీలక ఆధారం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణానికి (teacher recruitment scam) సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (enforcement directorate) సోదాల్లో కీలక ఆధారం లభ్యమైంది. దాదాపు 21 కోట్ల రూపాయలతో  అడ్డంగా దొరికిపోయిన రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీ (partha chatterjee) సహాయకురాలు, నటి, మోడల్ అర్పితా ముఖర్జీ (arpitha mukherjee) ఇంట్లో నల్ల డైరీ (Black Diary)ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇది కీలకం కానుంది. ఈ డైరీలో ఎవరెవరి ద్వారా ఏఏ తేదీల్లో ఎంత మొత్తం తీసుకున్నారనే వివరాలున్నాయి. అర్హత లేకున్నా ఎవరెవరికి ఉద్యోగాలిచ్చారో అందులో స్పష్టంగా ఉంది. దీంతో మంత్రి పార్థా ఛటర్జీతో పాటు కేసుకు సంబంధం ఉన్న వారి గుట్టు రట్టుకానుంది. టీఎంసీ మూలాలన్నీ బయటపడనున్నాయి. అర్పితా ముఖర్జీకి కూడా చిక్కులు పెరగనున్నాయి. అటు పార్థా చటర్జీకి ఆగస్ట్ మూడు వరకూ ఈడీ కస్టడీ కొనసాగనుంది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ గతంలో విద్యామంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి జరిగింది. 


మరోవైపు ఇదే కేసులో టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య (Manik Bhattacharya)కు ఈడీ సమన్లు జారీ చేసింది.             


మరోవైపు 21 కోట్ల రూపాయల నగదుతో  అడ్డంగా దొరికిపోయిన రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీ (partha chatterjee)పై సీఎం మమతాబెనర్జీ (mamata banerjee) ఇప్పటికే కన్నెర్ర చేశారు. పార్థా ఛటర్జీ దోషిగా తేలితే జీవితఖైదు విధించినా తనకు అభ్యంతరం లేదన్నారు. అందరూ ఒకేలా ఉండరన్న మమత, తానెప్పుడూ అవినీతిని సమర్థించబోనని చెప్పారు. వీలైనంత త్వరగా నిజం నిగ్గు తేలాలన్నారు. ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ అర్పితా ముఖర్జీతో ఎలాంటి సంబంధాలు లేవని మమత స్పష్టం చేశారు. తాను గతంలో దుర్గా పండాల్‌ను సందర్శించినప్పుడు ఒక మహిళను పార్థా చటర్జీ స్నేహితురాలని చెప్పి పరిచయం చేశారని మమత గుర్తు చేసుకున్నారు. తానేమీ దేవతను కాదని, ఎవరి స్నేహితులు ఎలాంటి వారో తనకెలా తెలుస్తుందని మమత ప్రశ్నించారు. 

Updated Date - 2022-07-27T01:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising