ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి వేడుకలకు శ్రీవారి ఆలయం ముస్తాబు

ABN, First Publish Date - 2022-12-31T07:40:18+05:30

కొత్త సంవత్సరాది కోసం టి.నగర్‌ వెంకటనారాయణరోడ్డులో వున్న శ్రీవారి ఆలయం ముస్తాబైంది. ఆంగ్ల సంవత్సరాదిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వేకువజామున 3 గంటల నుంచే సర్వదర్శనం

- భక్తులకు మాస్కు తప్పనిసరి

- టీటీడీ సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌

అడయార్‌(చెన్నై), డిసెంబరు 30: కొత్త సంవత్సరాది కోసం టి.నగర్‌ వెంకటనారాయణరోడ్డులో వున్న శ్రీవారి ఆలయం ముస్తాబైంది. ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని శ్రీనివాసుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చెన్నై సమాచార కేంద్ర సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌(AJ Shekhar) తెలిపారు. శుక్రవారం ఆయన ఆలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ... కొత్త సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి పండుగలు ఒక్కరోజు వ్యవధిలో వచ్చాయని, ఈ రెండు రోజుల్లో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. డిసెంబరు 31వ తేదీ అర్థరాత్రి 12.05 గంటల నుంచి 2 గంటల వరకు ధనుర్మాసం తిరుప్పావై పూజ, తోమాల, కొలువు, నైవేధ్యం చేసిన తర్వాత వేకువజామున 3 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామన్నారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజు కూడా మూడు గంటల నుంచే భక్తులను అనుమతిస్తామన్నారు. అయితే, ఉదయం 5.30 నుంచి 6 గంటల వరకు, ఉదయం 10 నుంచి 10.30 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి 6 గంటల సమయంలో నైవేధ్యం జరుగుతుందని, ఆ సమయాల్లో దర్శనానికి అనుమతించబోమన్నారు. ఈ పర్వదినాల్లో రూ.50లకే 40 వేల లడ్డూలను విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే, 50 వేల చిన్న లడ్డూలను (రూ.7) భక్తులకు రెండు రోజుల పాటు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. వీటితో పాటు ఏడు వేల మజ్జిగ ప్యాకెట్లతో పాటు వాటర్‌ బాటిళ్లను కూడా పంపిణీ చేస్తామన్నారు. కొత్త సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఆలయాన్ని దాదాపు 18 గంటలపాటు తెరిచి ఉంచుతామని, అందువల్ల భక్తులు వరుస క్రమంలో వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భక్తుడు మాస్కు ధరించి రావాలని కోరారు. వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలను ఆలయం పక్కనే ఉన్న కార్పొరేషన్‌ మైదానంలో పార్కింగ్‌ చేయాలని, ఇందుకోసం ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే, క్యూలో ఉండే భక్తులకు ఏదేని ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైన పక్షంలో తక్షణం వైద్య సేవలందించేందుకు విజయ హాస్పిటల్‌ తరపున హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి ఆలయం కోసం స్థలాన్ని సేకరించామని, ఈ ప్రాంతంలోనే కొత్త ఆలయాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. టి.నగర్‌ జీఎన్‌ చెట్టిరోడ్డులో చేపట్టిన అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, వచ్చే యేడాది ఫిబ్రవరిలో కుంభాభిషేకం జపిఇస్తామని ఏజే శేఖర్‌ తెలిపారు. ఈ సమావేశంలో సలహా మండలి సభ్యులు మోహన్‌రావు, అనిల్‌ కుమార్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T07:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising