ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Special Pujas: శ్రీవారికి ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2022-09-27T15:48:05+05:30

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swamy) కొలువైన తిరుమలలో నిర్వహిస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 26: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swamy) కొలువైన తిరుమలలో నిర్వహిస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాజధాని నగరంలో శ్రీవారి భక్తులు పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాయపురం నియోజకవర్గ పరిధిలోని ఆంజనేయనగర్‌లో సోమవారం ప్రత్యేకంగా రూపొందించిన స్వామివారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించి లోకకల్యాణార్ధం పూజలు చేశారు. 

    ఈ ప్రాంతంలోని మాతమ్మ దేవాలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. డా.అంబేడ్కర్‌ ఆదిఆంధ్ర అరుంధతీయ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మద్రాసు హైకోర్టు న్యాయవాది కేబీ కమల్‌(KB Kamal) అధ్యక్షతన వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.మోహనకృష్ణ, తమిళనాడు యాదవ సంఘ అధ్యక్షుడు సరసముత్తు, జర్నలిస్టులు వేల్‌మురుగన్‌, బెంజిమెన్‌, కర్రా బాలసుందరం, బీజేపీ నేతలు నాగరాజు, శ్రీపతి, తిరుమల పాదయాత్ర భక్తులు, శ్రీపెరుంబుదూర్‌ భగవత్‌ రామానుజాచార్యుల మఠం పూజారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముత్తయిదువులకు పసుపు కుంకుమలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - 2022-09-27T15:48:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising