ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంకలో మిన్నంటిన నిరసనలు.. విద్యార్థులపై వాటర్ కెనాన్, టియర్ గ్యాస్

ABN, First Publish Date - 2022-04-04T02:23:24+05:30

ఇక ప్రజానిరసనలు పతాకస్థాయికి చేరడంతో శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన తన రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబోయ రాజపక్సకు పంపారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తాజా సంక్షోభం తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: శ్రీలంకలో నెలకొన్ని ఆర్థిక సంక్షోభంపై నిరసనలు మన్నంటాయి. అక్కడి వందలాది మంది విద్యార్థులు ఆదివారం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, విద్యార్థులను చెదరగొట్టేందుకు స్థానిక పోలీసులు వాటర్ కెనాన్‌లు, టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. ప్రస్తుతం శ్రీలంకలోని సగటు మనిషికి ఆహారం, ఇంధనంతో పాటు నిత్యవసరాల ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. ఒక కోడి గుడ్డు ధర 30 రూపాయలకు పైగా ఉంటే ఇక కిలో బియ్యం ధర 200 రూపాయలకు పైగా పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజూ వారి కట్టింగ్‌లు పెరిగిపోతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.


ఇక ప్రజానిరసనలు పతాకస్థాయికి చేరడంతో శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన తన రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబోయ రాజపక్సకు పంపారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తాజా సంక్షోభం తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదని, కోవిడ్ మూలంగా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని రాజపక్స ప్రభుత్వం చెబుతూ వస్తోంది. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. 2.5 బిలియన్ డాలర్ల సాయంతో పాటు లక్షల టన్నుల ఇంధనాన్ని పంపింది. బియ్యం కూడా పంపింది.

Updated Date - 2022-04-04T02:23:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising