ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన rajapaksa

ABN, First Publish Date - 2022-07-15T01:24:19+05:30

సింగపూర్: శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబయ రాజపక్స రాజీనామా చేశారు. ఈ మెయిల్ ద్వారా ఆయన తన రాజీనామాను పార్లమెంట్ స్పీకర్‌కు పంపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగపూర్: శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబయ Rajapaksa రాజీనామా చేశారు. ఈ మెయిల్ ద్వారా ఆయన తన రాజీనామాను పార్లమెంట్ స్పీకర్‌కు పంపారు. Rajapaksa రాజీనామా తమకు అందిందని శ్రీలంక స్పీకర్ కార్యాలయం స్పష్టం చేసింది.






ఇటీవలి వరకూ Rajapaksa సోదరులు, మంత్రివర్గంలో ఉన్న వారి బంధువులు తీసుకున్న నిర్ణయాలు, బంధుప్రీతి, అవినీతికి పాల్పడటంతోపాటు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించారు. ప్రజలను ఆకర్షించి పదవిలోకి రావడంకోసం విపరీతమైన ప్రజాకర్షక హామీలు ఇవ్వడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అవసరాలు తీర్చుకోవడం కోసం కరెన్సీని 42 శాతం అధికంగా ముద్రించడం, ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం 15 శాతానికి మించడం ఇలా ఒకదాని పర్యవసానం మరొక దానిపై తీవ్రంగా పడింది. చైనా నుంచిదిగుమతి చేసుకునే ఎరువులు నాణ్యతగా లేకపోవడం వల్ల వేరే దేశాలనుంచి దిగుమతి చేసుకోవాలంటే సరిపడిన డాలర్లు (విదేశీ మారక ద్రవ్యం) లేకపోవడం, ఫలితంగా 100 శాతం సేంద్రీయ వ్యవసాయానికి అడుగులు వేయడం, అది సత్ఫలితాలను ఇవ్వకపోగా తీవ్ర తిండి గింజల కరువుకు దారి తీసింది. 

చివరికి విదేశీ సంస్థలు, ప్రపంచ దేశాలకు అప్పుకట్టలేని స్థితిలో శ్రీలంక ఉంది. అప్పులు కట్టలేమని బహిరంగంగా ప్రకటించింది కూడా. ప్రస్తుతం ఆహార సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులతోపాటు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. కాగితం, సిరా కొరతతో కనీసం విద్యార్థులకు పరీక్షల నిర్వహణ కూడా వాయిదా వేశారు. డీజిల్‌ విక్రయాల నిలిపివేత, రోజుకు 15 గంటల కరెంటు కోత ఇలా చాలా సమస్యలను శ్రీలంక ఎదుర్కుంటోంది. 

మరోవైపు Rajapaksa... మాల్దీవుల నుంచి తన కుటుంబంతో సహా సింగపూర్‌కు పారిపోయారు. సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన సింగపూర్‌ చేరుకున్నారు. అయితే ఆయన తమను ఆశ్రయం కోరలేదని, ప్రైవేట్ పర్యటనలో భాగంగా వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ తొలుత వెల్లడించింది. మొత్తం వ్యవహారంలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది.



Updated Date - 2022-07-15T01:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising