ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sri Lanka మాజీ మంత్రి దుబాయ్ పారిపోయేందుకు యత్నం...అడ్డుకున్న అధికారులు

ABN, First Publish Date - 2022-07-12T16:07:35+05:30

శ్రీలంక దేశ మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే దుబాయ్‌కి పారిపోయేందుకు ప్రయత్నించగా విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: శ్రీలంక దేశ మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే దుబాయ్‌కి పారిపోయేందుకు ప్రయత్నించగా విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే సోదరుడు బాసిల్ రాజపక్సే కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలోని వీఐపీ టెర్మినల్ నుంచి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రజలు ఆయనను గుర్తించి దేశం విడిచి వెళ్లడాన్ని వ్యతిరేకించారని సమాచారం. దీంతో విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అతని ప్రయాణాన్ని క్లియర్ చేయడానికి నిరాకరించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.అదే సమయంలో బాసిల్ రాజపక్సకు భారతదేశంలో ఆశ్రయం కల్పిస్తున్నట్లు వచ్చిన వార్తలను భారత ప్రభుత్వ వర్గాలు ఖండించాయి.


ద్వీప దేశంలో భారీ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో రేపు రాజీనామా చేసే అవకాశం ఉన్న అధ్యక్షుడు రాజపక్సే భారత్‌కు పారిపోయారని చేస్తున్న ప్రచారాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. శ్రీలంక అగ్రనేతలు ఎవరూ బయటకు రాలేరని ఆ వర్గాలు సూచించాయి.గత కొన్ని నెలలుగా శ్రీలంక భారీ ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ వారాంతంలో నిరసనకారులు అధ్యక్షుడి అధికారిక నివాసంలోకి ప్రవేశించడంతో నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి.

Updated Date - 2022-07-12T16:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising