ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంకేతిక లోపాలు తలెత్తినా Occupency rate లో Spice Jet ముందంజ

ABN, First Publish Date - 2022-07-13T00:45:58+05:30

సాంకేతిక లోపాల పరంగా ఇటీవల ఆటుపోట్లు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్.. ఆక్యుపెన్సీ రేటులో మాత్రం ఇతర..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సాంకేతిక లోపాల పరంగా ఇటీవల ఆటుపోట్లు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్ (Spicejet) ఆక్యుపెన్సీ రేటు (Occupency rate)లో మాత్రం ఇతర ఎయిర్‌లైన్స్ కంటే ముందంజలో ఉంది. జూలై 1వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేటు 80 శాతానికి పైనే ఉందని స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. గత 24 రోజుల్లో తొమ్మిది సార్లు స్పైస్ జెట్‌ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తిన ఘటనలు చోటుచేసుకున్నాయి.


''ప్రయాణికులు మాపై ఉంచిన నమ్మకం, విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను'' అని స్పైస్ జెట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరెక్టర్ అజయ్ సింగ్ తెలిపారు. ఇండియాలో అందరూ ప్రేమించే ఎయిర్‌లైన్స్‌ స్పైస్‌జెట్ అనడానికి ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టరే (PLF) తాజా నిదర్శనమని చెప్పారు. జూలై 1 నుంచి 10వ తేదీ మధ్య ఇతర ఎయిర్‌లైన్స్‌ల ఆక్యుపెన్సీ రేటు 70 నుంచి 80 శాతం ఉందని ఏవియేషన్ వర్గాలు తెలిపాయి. స్పైస్ జెట్ వివరాల ప్రకారం, జూలై 1న స్పెస్ జెట్ ఆక్యుపెన్సీ రేటు 83.1గా ఉంది. 2వ తేదీన 88.2 శాతం, 3న 90.1 శాతం, 4న 86.5 శాతం, 5న 86.2 శాతం, 6న 85.8 శాతం, 7న 84.1 శాతం, 8న 84.2 శాతం, 9న 86.6 శాతం, 10న 85.1 శాతం, 11న 81.3 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉంది.


డీజీసీఏ షోకాజ్ నోటీసు..

స్పైస్ జెట్ విమానాల్లో ఇటీవల వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఆ ఎయిర్‌లైన్స్‌కు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఈనెల 6న షోకాజ్ నోటీసు ఇచ్చింది. సురక్షితమైన, సమర్ధవంతమైన, విశ్వసనీయమైన విమానయాన సేవలు అందించడంలో విఫలమయ్యారని చెబుతూ ఈ షోకాజ్ నోటీసు పంపింది.


అజయ్ సింగ్ వివరణ...

కాగా, ఇటీవల తమ విమానాల్లో తలెత్తిన సాంకేతిక లోపాలపై ఈనెల 6న ఒక ఇంటర్వ్యూలో అజయ్ సింగ్ సమాధానమిచ్చారు. ఇవన్నీ చాలా చిన్నచిన్న సాంకేతిక లోపాలని, ప్రతి ఎయిర్‌లైన్స్‌కి ఇవి సహజమేనని అన్నారు. భద్రతా ఆందోళనల నేపథ్యంలో స్పైస్‌జెట్ ఇప్పుడు ఎలాంటి మార్పులు తీసుకోనుందనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, నిశ్చయంగా తాము చాలా జాగ్రత్తగా ఉంటామని అన్నారు. ప్రతి విమానాన్ని బయలుదేరడానికి ముందే పూర్తిగా తనిఖీ చేస్తామని, తాజాగా ఈ తనిఖీని మరింత కట్టుదిట్టం చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-07-13T00:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising