ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Spicejet కు డీజీసీఏ భారీ షాక్..

ABN, First Publish Date - 2022-07-28T01:36:18+05:30

స్పైస్‌జెట్‌కు డెరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బుధవారంనాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌ (SpiceJet)కు డెరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారంనాడు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్ నడుపుతున్న విమాన సర్వీసుల్లో 50 శాతం సర్వీసులను మాత్రమే 8 వారాల పాటు ఆపరేట్ ‌చేయాలని ఆదేశించింది. గత ఏప్రిల్ 1 నుంచి జూలై 5 వరకూ అనేక మార్లు స్పైస్ జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తిన నేపథ్యంలో డీజీసీఏ ఈ ఆదేశాలు జారీ చేసింది.


''పలుమార్లు స్పాట్ చెక్‌లు, తనిఖీలు జరిపాం. మేము ఇచ్చిన షోకాజ్ నోటీసుకు స్పైస్‌జెట్ సమర్పించిన సమాధానం కూడా పరిశీలించాం. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్‌ ప్రస్తుతం నడుపుతున్న విమానాల్లో కేవలం 50 శాతం  విమాన సర్వీసులకు పరిమితం చేయాలని నిర్ణయించాం'' అని డీజీసీఏ ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. సురక్షితమైన, సమర్ధవంతమైన, విశ్వసనీయమైన ట్రాన్స్‌పోర్ట్ సర్వీ్స్‌గా నిరూపించుకోవడంలో స్పైస్‌జెట్ విఫలమైందని పేర్కొంది. గత 18 రోజుల్లో కనీసం 8 సార్లు స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. కాగా, ఈ ఎనిమిది వారాల సమయంలో స్పైస్‌జైట్ ఎయిర్‌లైన్స్ సాంకేతకంగా, ఇతర అంశాల పరంగా తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2022-07-28T01:36:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising