ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్యాసింజర్ రైళ్ల నిర్వహణకు... ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు

ABN, First Publish Date - 2022-05-20T22:14:35+05:30

అత్యవసర పరిస్థితుల్లో ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకుగాను ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లను Indian Railways వినియోగించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

* emergencyల్లో వెసులుబాటు 

న్యూఢిల్లీ : అత్యవసర పరిస్థితుల్లో ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకుగాను ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లను Indian Railways వినియోగించనుంది. అత్యంత రద్దీగా ఉండే రెండు రైల్వే మార్గాలైన ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై మార్గాల్లోని ప్రయాణికులకు ఈ క్రమంలో ప్రయోజనం చేకూరుతుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో... సంబంధిత రైల్వే లైన్లలో  ఫ్రైట్ కారిడార్ నెట్‌వర్క్‌లో ప్యాసింజర్ రైళ్లను నడపడానికి అనుమతించాలని Railway Board నిర్ణయించింది. Railway Board ఆదేశాల  ప్రకారం... అధిక వేగం వెళ్ళేలా... సరుకు రవాణా రైళ్లకు ప్రత్యేకంగా ఏర్పాటైన Indian Railwayకు సంబంధించిన తూర్పు,  పశ్చిమ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్‌లు ఇప్పుడు ప్రయాణికుల రైలు సేవల కోసం అత్యవసర సమయాల్లో ఉపయోగించనున్నారు.


ప్రకృతి వైపరీత్యాలు, రైలు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రయాణీకులను ఈ  ఫ్రైట్ కారిడార్ నెట్‌వర్క్‌లో గమ్యస్థానాలకు రవాణా చేసే సందర్భాల్లో ఈ ఏర్పాటు ఉపయోగపడనుంది. అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ-హౌరా, ఢిల్లీ - ముంబై మార్గాల్లోని ప్రయాణికులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. కాగా... ఈ రెండు రైలు మార్గాలు కూడా రెండు DFCలకు సమాంతరంగా నడుస్తాయి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. రైల్వే బోర్డు అత్యవసర పరిస్థితుల్లో... సంబంధిత రైల్వే లైన్లలోని ఫ్రైట్ కారిడార్ నెట్‌వర్క్‌లో ప్యాసింజర్ రైళ్లను నడపడానికి అనుమతించేందుకు నిర్ణయించింది. రైల్వే బోర్డు అధికారులు చెబుతున్న మేరకు... తూర్పు డీఎఫ్‌సీ, వెస్ట్రన్ డీఎఫ్‌సీలు సరుకు రవాణా కోసం మాత్రమే నిర్మితమవుతుండడంతోపాటు ఈ కారిడార్‌లలో హై స్పీడ్ ఫ్రైట్ రైళ్లను(గంటకు 100 కిమీలు) నడుపుతున్నారు. డీఎఫ్‌సీలో ప్యాసింజర్ రైలు సర్వీసులను నడపడానికి ఎలాంటి నిబంధనలూ లేవని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.


ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే... ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ నెట్‌వర్క్‌లో ప్యాసింజర్ రైలు సేవలను నడపడానికి రైల్వే బోర్డు అనుమతినిచ్చింది. సంబంధిత నివేదిక ప్రకారం... తూర్పు DFC, పశ్చిమ DFCల్లో 80 శాతం మేర ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై రైలు మార్గాలకు సమాంతరంగా నడుస్తాయి. ఇప్పటికే ఉన్న రైల్వే మార్గాల్లో అంతరాయమేర్పడినపక్షంలో... ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌లో ప్యాసింజర్ రైలు సేవలను నడపేందుకు  అనుమతిస్తుంది.

Updated Date - 2022-05-20T22:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising