ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పేస్ స్టేషన్‌ను భారత్‌లో కూల్చాలా: రష్యా

ABN, First Publish Date - 2022-02-26T20:59:07+05:30

రష్యాపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, ఈ నిర్ణయం తమ భాగస్వామ్యంలో నడుస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్‌ఎస్‌) పరిశోధనలపై ప్రభావం చూపుతుందని రష్యా అభిప్రాయపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యాపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, ఈ నిర్ణయం తమ భాగస్వామ్యంలో నడుస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్‌) పరిశోధనలపై ప్రభావం చూపుతుందని రష్యా అభిప్రాయపడింది. ఇదే జరిగితే, 500 టన్నుల బరువున్న స్పేస్ స్టేషన్ భారత్ లేదా చైనాలో పడే అవకాశాలుంటాయని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ (రొస్కొస్మోస్) చీఫ్ డిమిట్రీ రోగోజిన్ అన్నారు. ‘‘రష్యాపై అమెరికా విధించే ఆంక్షలు ఐఎస్‌ఎస్‌ పరిశోధనలపై ప్రభావం చూపుతాయి. పరిశోధనలకు రష్యా దూరంగా ఉంటే స్పేస్ స్టేషన్ అనియంత్రిత కక్ష్యలో తిరగకుండా ఎవరు అడ్డుకుంటారు? అమెరికా లేదా యూరప్‌లో పడకుండా ఎవరు రక్షిస్తారు? స్పేస్ స్టేషన్ ఇండియా లేదా చైనాలో పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ అంశంపై ఆ రెండు దేశాలను బెదిరించాలా? ఐఎస్ఎస్ రష్యా మీదుగా మాత్రం వెళ్లదు. కాబట్టి, ఏదైనా నష్టం జరిగితే అది మీకే’’ అంటూ అమెరికాను డిమిట్రీ హెచ్చరించారు. అమెరికా, రష్యా, కెనడా, యూరప్, జపాన్ దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో ‘ఐఎస్ఎస్‘ పనిచేస్తోంది. 

Updated Date - 2022-02-26T20:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising