ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు

ABN, First Publish Date - 2022-07-01T17:26:05+05:30

దక్షిణకన్నడ జిల్లా వ్యాప్తంగా రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్న కారణంగా జనజీవనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                - ఒకరి మృతి.. నేడు విద్యాసంస్థలకు సెలవు


బెంగళూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): దక్షిణకన్నడ జిల్లా వ్యాప్తంగా రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్న కారణంగా జనజీవనం స్థంభించింది. జిల్లా కేంద్రమైన మంగళూరులోని పోలీసు క్వార్టర్స్‌ సమీపాన బుధవారం రాత్రి గుంతలో పడి దృవత్‌ అనే వ్యక్తి కుమారుడు సునిల్‌(46) మృతి చెందారు. మూల్కి కొల్నాడు కేఎస్ రావ్‌ నగర్‌లోని పోలీసు క్వార్టర్స్‌ వద్ద ప్రమాదం జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా వ్యాప్తంగా వర్షాలు తెరిపి నివ్వకపోగా మరింత ఎక్కువ కావచ్చునని వాతావరణ పరిశోధనా శాఖ ప్రకటించిన మేరకు శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి డిగ్రీ కళాశాలల దాకా సెలవు వర్తిస్తుందని జిల్లాధికారి ప్రకటించారు. దీనిని బట్టి వరుసగా రెండో రోజు విద్యాసంస్థలు పనిచేయనట్లు అయ్యింది. కాగా సముద్ర తీరంలో ఉండే దక్షిణకన్నడ, ఉత్తరకన్నడతో పాటు ఉడుపి జిల్లాల వ్యాప్తంగా వర్షాలు జోరుగా సాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Updated Date - 2022-07-01T17:26:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising