ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ చీఫ్ మళ్లీ సోనియానే

ABN, First Publish Date - 2022-03-14T02:48:48+05:30

కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధినేతగా మరింత కాలం సోనియా గాంధీనే కొనసాగుతారు. మాకందరికీ నాయకత్వం వహించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటారు. ఆమె నాయకత్వంపై పార్టీలో అంతటి నమ్మకం ఉంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరనేదానికి తెరపడింది. మరింత కాలం పాటు సోనియా గాంధీనే పార్టీకి తాత్కాలిక అధినేతగా వ్యవరించనున్నారు. ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అగ్ర నేతలంతా సోనియాకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నేతలు ఎంత మంది ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గాంధీ కుటుంబం మినహా మరొకరిని ప్రతిపాదించలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.


సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధినేతగా మరింత కాలం సోనియా గాంధీనే కొనసాగుతారు. మాకందరికీ నాయకత్వం వహించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటారు. ఆమె నాయకత్వంపై పార్టీలో అంతటి నమ్మకం ఉంది. అందుకే పార్టీనేతలంతా సోనియా గాంధీకే మొగ్గు చూపారు’’ అని అన్నారు.

Updated Date - 2022-03-14T02:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising