ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sonia Gandhi పర్సనల్ సెక్రటరీపై రేప్ కేసు..

ABN, First Publish Date - 2022-06-28T03:36:52+05:30

Sonia Gandhi పర్సనల్ సెక్రటరీపై రేప్ కేసు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ(Congress party) అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)కి పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న 71 ఏళ్ల పీపీ మాధవన్‌‌పై అత్యాచారం, నేరపూరిత బెదిరింపుల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపడమే కాకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అత్యాచారానికి పాల్పడ్డాడని 26 ఏళ్ల బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సోమవారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు  వెల్లడించారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని, విషయం బయటకు పొక్కితే తీవ్ర పర్యావసనాలు ఉంటాయని బాధితురాలిని నిందితుడు బెదిరించాడని తెలిపారు. ఈ మేరకు జూన్ 25న ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందిందని వివరించారు. 


ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 376(రేప్), సెక్షన్ 506(బెదిరింపులు) కింద కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు జరుగుతోందని ద్వారకా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్ పోలీస్ ఎం.హర్షవర్ధన్ తెలిపారు. ఈ ఫిర్యాదులో రాజకీయ నాయకుల పేర్లేమీ లేవు. కేవలం నిందితుడు మాధవన్ పేరు మాత్రమే ఉందన్నారు. కాగా బాధిత యువతి ఢిల్లీలో నివసిస్తోంది. ఆమె భర్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పనిచేసేవాడు. హోర్డింగ్స్ అంటించేవాడు. అయితే 2020లో అతడు మరణించాడని పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2022-06-28T03:36:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising