ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra: రాహుల్‌తో కలిసి నడిచిన సోనియాగాంధీ

ABN, First Publish Date - 2022-10-06T16:46:47+05:30

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్రలో(Bharat Jodo Yatra) మొదటిసారి గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాండ్యా(కర్ణాటక): కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్రలో(Bharat Jodo Yatra) మొదటిసారి గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు. అనారోగ్యంతో చాలా కాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సోనియాగాంధీ గురువారం మాండ్యాలో కాంగ్రెస్ కార్యకర్తలు వెంటరాగా తనయుడు రాహుల్ తో కలిసి నడిచారు.(Congress March) బుధవారం బేగూర్ గ్రామంలో ని దేవాలయాన్ని సోనియా సందర్శించారు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి  నుంచి సెప్టెంబరు 7వతేదీన ప్రారంభించిన భారత్ జోడో యాత్ర గత నెల 30వతేదీన బీజేపీ పాలిత కర్ణాటకలోకి ప్రవేశించింది.(BJP Ruled Karnataka) సోనియా గాంధీ మైసూరు రాకతోపాటు ఆయుధ పూజ, విజయదశమి (Vijayadashami) సందర్భంగా రెండు రోజులపాటు విరామం ఇచ్చారు. 


రాహుల్ పాదయాత్రలో సోనియా పాల్గొనడం తమ కర్ణాటక రాష్ట్రానికి గర్వకారణమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్(Karnataka Congress chief DK Shivakumar) చెప్పారు.విజయదశమి తర్వాత సోనియా గాంధీ కర్ణాటకలోని వీధుల్లో పాదయాత్ర చేయడం వల్ల బీజేపీ దుకాణం బంద్ అయి... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని శివకుమార్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-10-06T16:46:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising