ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోనియా గాంధీ కీలక భేటీ.. పీకే చేరికపై తుది నిర్ణయం ?

ABN, First Publish Date - 2022-04-19T02:22:31+05:30

న్యూఢిల్లీ : ఎంపిక చేసిన కొద్దిమంది పార్టీ సహచరులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2024 సాధారణ ఎన్నికలపై వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రణాళిక, కాంగ్రెస్‌లో పీకే చేరిక అంశాలు భేటీలో ప్రధాన అజెండాగా ఉన్నాయని పార్టీవర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీలో పీకే చేరికపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పీకే చేరిక ప్రతిపాదనపై గతంలో అసమ్మతి వ్యక్తమైన నేపథ్యంలో ఈసారి పార్టీలో అంతర్గత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఎంపిక చేసిన కొద్దిమంది పార్టీ సహచరులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2024 సాధారణ ఎన్నికలపై వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రణాళిక, కాంగ్రెస్‌లో పీకే చేరిక అంశాలు భేటీలో ప్రధాన అజెండాగా ఉన్నాయని పార్టీవర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీలో పీకే చేరికపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పీకే చేరిక ప్రతిపాదనపై గతంలో అసమ్మతి వ్యక్తమైన నేపథ్యంలో ఈసారి పార్టీలో అంతర్గత అభిప్రాయాన్ని తెలుసుకోవాలని సోనియా గాంధీ నిర్ణయించారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసం 10 జన్‌పథ్ రోడ్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ లీడర్లు ముకుల్ వాస్నిక్, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ పాల్గొన్నారు. కాగా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీలతో ప్రశాంత్ కిశోర్ సన్నిహితంగా మెలుగుతున్న నేపథ్యంలో 2024 ఎన్నికలపై పీకే ప్రణాళిక, పార్టీలో చేరికపై ఈ భేటీలో అసమ్మతి స్వరాలు వినిపించే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిశోర్ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే టీఎంసీకి, వైఎస్సాఆర్‌సీపీకి పీకే సంస్థ ఐప్యాక్ ఎన్నికల్లో సహకారం అందించింది. 


కాగా 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 370 సీట్లలో పోటీ చేయాలని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించాడని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలలో పొత్తులతో ముందుకెళ్లాలని సూచించినట్టు ఆయా వర్గాలు వివరించాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశాలలో ఒంటరిగా.. తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలలో కూటములతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని పీకే సూచించాడు. ఈ ప్రతిపాదనకు రాహుల్ గాంధీ కూడా ఓకే అన్నారని పేర్కొన్నాయి. అయితే ఈ ప్రతిపాదనపై పార్టీ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు మే 2 వరకు అవకాశముందని ఆయా వర్గాలు వివరించాయి.

Updated Date - 2022-04-19T02:22:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising